Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అల్లు అర్జున్ సైకత శిల్పం

aa

‘అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్ నిర్మాతగా బన్నీ వాసు సహ నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలో అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా విశాఖపట్నం అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున వైజాబ్ బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. 5  ఫీట్ల ఎత్తులో 30 ఫీట్ల పొడవున ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన సైకత శిల్పి మానస్ శేషు ఆధ్వర్యంలో ఈ సైకత శిల్పం రూపుదిద్దుకుంది. అల్లు అర్జున్‌కు అభిమానులు అందిస్తున్న అందమైన కానుక ఇదని మానస్ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రం డైలాగ్ ఇంపాక్ట్  టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేయనున్నారు.

aa1

Comments

comments