Home సినిమా ‘డిక్టేటర్’ కొత్త లుక్

‘డిక్టేటర్’ కొత్త లుక్

Dictatorనందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిక్టేటర్’. బాలయ్య నటిస్తున్న 99 చిత్రమిది కాబట్టి దర్శక నిర్మాతలు సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వినాయక చవితి సందర్బంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన మరో లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రతి ఏడాది బాలకృష్ణ నటించిన చిత్రంలో ఏదో ఒక లుక్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తూ బాలకృష్ణ తన అభిమానులు, ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతకం చేసిన న్యూ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అంజలి, సోనాల్‌చౌహాన్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు.