Search
Saturday 17 November 2018
  • :
  • :

ఎలర్జీ చిరాకు పెడుతోందా?

Sneeze-Women

బయట నుంచి వచ్చి మన రోగనిరోధక వ్యవస్థను డిస్టర్బ్ చేసేవి ఎలర్జెంట్స్. అవి మనం తినే ఆహారం, లేదా పెంపుడు జంతువుల నుంచి వస్తాయి. రోగనిరోధకవ్యవస్థ మనల్ని హానికారక పాథోజెన్స్, ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. మన మీద అటాక్ చేసిన ఎలర్జెంట్లనుబట్టి ఆయాసం, జలుబు, రకరకాల లక్షణాలుంటాయి. ఇతర పదార్థం లోనికి ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ ఎందుకు ఎలర్జీకి గురవుతుందనేది ఇప్పటి వరకు పరిశోధకులు గుర్తించలేదు. అయితే ఎలర్జిక్ రియాక్షన్లు వంశపారంపర్యంగా వచ్చే అవకాశా లుంటాయి. కాని కొన్ని ఎలర్జీలు ఒకరి నుంచి ఇంకొకరికి సోకవు. ఉదాహరణకు, తల్లికి షెల్‌ఫిష్ తింటే ఎలర్జీ అయితే బిడ్డకి కూడా అదే ఎలర్జీ ఆమె నుంచి సంక్రమిస్తుందనడానికి లేదు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఎలర్జీ, ఆస్తమా, ఇమ్యునాలజీ ప్రకారం, సాధారణ ఎలర్జీలు వీటి ద్వారా వస్తాయి.
జంతువులు : పెంపుడు జంతువులు, దుమ్ము కణాలు, బొద్దింకలు
మందులు : పెన్సిలిన్, సల్ఫా మందులు
ఆహారపదార్థాలు : గోధుమ, నట్స్, పాలు, షెల్‌ఫిష్, గుడ్లు.
కీటకాలు : తేనెటీగలు, దోమలు
మొక్కలు : గడ్డి, చెట్లు, మొక్కలు, పూల నుంచి వచ్చే పుప్పొడులు.
సీజనల్‌గా ఎలర్జీలు, జ్వరాలు, కళ్లు దురద, నీరు కారడం, ముక్కు కారడం, దగ్గు ఈ లక్షణాలన్నీ కూడా సాధారణమే.
డాక్టర్‌నెప్పుడు కలవాలి?
చికిత్స తీసుకోవడం వలన రోగనిరోధకవ్యవస్థ పనితీరు మెరుగుపడి ఎలర్జీ బారి నుంచి బయట పడవచ్చు. ఎలర్జీ లక్షణాలను ఎలా తగ్గించుకో వాలో డాక్టర్ సలహా పాటించవచ్చు.
ఆహార పదార్థాల వలన ఎలర్జీ వస్తే వాపు, తల తిరుగుడు, కడుపులో తిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో తిన్న ఆహారంలో ఏదో లోపం ఉండి ఉంటుందన్న విషయం అర్థం అవుతుంది. ఒకవేళ తిన్న భోజనంలో ఏదన్నా తేడా వచ్చి ఆరోగ్యం దెబ్బతింటే వెంటనే మెడికల్ ప్రొఫెషనల్‌ని వెంటనే కలుసుకోవాలి. రియాక్షన్ ఎందుకు వచ్చిందో చెప్తారు. ఫుడ్ ఎలర్జీలను ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అనే ప్రక్రియ ద్వారా తగ్గిస్తారు డాక్టర్లు. ముందుగా మీరు రోజువారీ తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని తీసేయాలి. మానేసిన తర్వాత తర్వాత మీకు కనిపించే లక్షణాలను బేరీజు వేసి ఒక డైరీలో రాసి పెట్టుకోవాలి. అలా నెమ్మదిగా ఏం తింటే ఎలర్జీ వస్తుందో కనుక్కుంటారు.
సీజనల్ ఎలర్జీలు : ఊపిరి ఆడకపోవడం, జలుబు, కళ్లవాపు లాటి లక్షణాలుంటే చాలా వరకు ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. సమస్య త్రీవ్రంగా ఉంటే డాక్టర్‌కి చూపించుకోవాలి.
తీవ్రమైన ఎలర్జీలు : ఎలర్జీలు త్రీవ్రంగా ఉంటే ఎనఫిలాక్సిస్‌కి దారితీస్తుంది. దాని వలన ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఊపిరి తీసుకోవడంలో కష్టం, స్పృహ కోల్పోవడం లాటి లక్షణాలుంటే అత్యవసరంగా భావించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
చర్మ పరీక్ష : ఎలర్జీ పరీక్షల్లో స్కిన్ టెస్ట్ ఒకటి. చర్మానికి సూదులతో కొన్ని ఎలర్జెంట్లను ఎక్కించి కొద్దిగా చర్మాన్ని తీసి పరీక్షిస్తారు. చర్మం రియాక్ష న్లను రికార్డు చేసి ఉంచుతారు. ఫలానా ఎలర్జీన్ వలన రియాక్షన్ వస్తుందని తెలిస్తే దాని ప్రకారం చికిత్స చేస్తారు.
రక్తపరీక్ష : ఎలర్జీలకు కారణమయ్యే యాంటీ బాడీస్ గురించి తెలుసుకోవడానికి రేడియో ఎలర్జీ సార్బెంట్ అనే బ్లడ్ టెస్ట్ చేయమని డాక్టర్లు సూచిస్తారు.
చికిత్సలు : ఇమ్యునోథెరపీ కొద్ది సంవత్సరాల చికిత్సాకాలంలో ఇంజెక్షన్ కోర్సు ద్వారా శరీరం ఎలర్జీ బారిన పడకుండా కాపాడతారు. సరైన పద్ధతిలో ఇమ్యునోథెరపీ ఇస్తే ఎలర్జీ లక్షణాల నుంచి బయటపడవచ్చు.
ఎమర్జెన్సీ ఎపినెఫ్రైన్ : ఒకవేళ జీవితాన్ని ప్రమా దంలో పెట్టే ఎలర్జీ ఉంటే ఎమర్జెన్సీ ఎపి నెఫ్రైన్ అనే షాట్‌ను వెంట తీసుకెళ్లాలి. వైద్య ం అందే లోపు ఆ షాట్ ప్రాణాలు కాపాడుతుంది.
ఇతర చికిత్సలు : ఎలర్జీలకు చికిత్స చేయ డానికి చాలా సహజమైన పద్ధతులుం టాయి. కొన్నిసార్లు సహజచికిత్సా ప్రక్రియల్లో వేరే రకాలైన ఎలర్జెంట్స్ ఉండే అవకాశం ఉంది.

Comments

comments