Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

వీడ్కోలు మ్యాచ్ అడిగినా..

Virender-Sehwagసెహ్వాగ్ విజ్ఞప్తిని నిరాకరించిన బిసిసిఐ?

న్యూఢిల్లీ : డాషింగ్ వీరేంద్ర సెహ్వాగ్‌ను బిసిసిఐ ఘోరంగా అవమానించిందా అంటే అవుననే తెలుస్తోంది. ఏ భారత బ్యాట్స్‌మన్‌కూ సాధ్యం కాని రికార్డులు అందుకున్న ఈ నవజఫ్‌గర్ నవాబ్.. ఘనంగా వీడ్కోలు పలుకుతాను, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ నోరు తెరిచి ప్రాధేయపడినా బిసిసిఐ కరుణించలేదని తాజా సమాచారం. కెరీర్‌ను ఘనంగా ముగించాలని ఉందని గతంలో పలుమార్లు పేర్కొన్న సెహ్వాగ్.. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నాను. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడనిస్తే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని బిసిసిఐకి లేఖ రాసినట్టు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. అయితే సెహ్వాగ్ విజ్ఞప్తిని బిసిసిఐ నిరాకరించడంతో అసంతృప్తితోనే ఆఘమేఘాల మీద కెరీర్‌కు వీడ్కోలు పలికాడని పేర్కొంది. కాగా సెహ్వాగ్‌కు ఘనమైన వీడ్కోలు పలికేందుకు అవకాశమివ్వండని తాను బిసిసిఐతో వాదించినట్లు మాజీ కెప్టెన్ గంగూలీ పేర్కొన్నాడు. మైదానంలో సెహ్వాగ్ ఆడుతుంటే ఇష్టపడతాను. భారత్‌కు దేవుడిచ్చిన సహజసిద్ద బ్యాట్స్‌మన్ అతను. అలాంటి ఆటగాడు ఘనమైన వీడ్కోలు పలికేందుకు మనం అవకాశం కల్పించాలి. దీని కోసం దక్షిణాఫ్రి కాతో ముంబయిలో జరిగే ఐదోవన్డేకు సెహ్వాగ్‌ను ఎంపిక చేయండని బిసిసిఐతో వాదించానని గంగూలీ తెలిపాడు. సెహ్వాగ్‌కు ఘనమైన వీడ్కోలు దక్కనందుకు అతని చిన్ననాటి కోచ్ ఎఎన్.శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెహ్వాగ్ టీమిండియాలో చోటు కోల్పోయిన తరువాత బిసిసిఐ,ఢిల్లీ క్రికెట్ సంఘం రెండూ కూడా అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Comments

comments