Home ఆఫ్ బీట్ ప్రత్యర్థిని ఓడించింది… ప్రజలను గెలువలేదు

ప్రత్యర్థిని ఓడించింది… ప్రజలను గెలువలేదు

ఓ ఇంటర్య్వూ లో బిజెపిపై విద్యార్థి నాయకుడు కన్హయ్య విసుర్లు

Kanaiah

జెఎన్‌యు విద్యార్థి సంఘం రీసెర్చ్ స్కాలర్ కన్హయ్య కుమార్ ఆలోచనల ప్రస్థానం ఇప్పుడు క్యాంపస్‌ల పరిధి దాటింది. పలు సామాజిక సదస్సులలో వక్తగా రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచార సభలలో పాల్గొంటూ విస్తరిస్తున్నారు. జీవితంలో తాను మర్చిపోలేని ఘట్టం విద్రోహ ముద్రతో నెలరోజుల పాటు తీహార్ జైలులో గడిపిన క్షణాలే అని చెప్పే ఈ యువనేత తన పుస్తకం ‘ఫ్రమ్ బీహార్ టు తీహార్’ విడుదల సందర్భంగా ‘దిన్యూస్ మైన్యూట్’తో మాట్లాడారు. పుస్తకాన్ని జాగర్‌నాట్ ప్రచురించింది. ఈ సందర్భంగా జైలురోజుల గురించి, వామపక్షాల గురించి, అంబేద్కరైట్స్ స్డూడెంట్ యూనియన్‌లు లెఫ్ట్‌కు విసురుతున్న సవాళ్లపైనా, విశ్వవిద్యాలయాలలో విద్యార్థి రాజకీయాలపైనా పలు ప్రశ్నలకు కన్హయ్య సమాధానాలు ఇచ్చారు. ఇంటర్వూలోని కీలక అంశాలు ఇవే…

ప్రశ్న: ఈ పుస్తకాన్ని ఎందుకు తీసుకువస్తున్నారు?
జవాబు: నిజానికి ఈ పుస్తకం రాయాలని ముందుగా నేను అనుకోలేదు. అయితే జైలులో అనుభవాలను పొందుపర్చుకుంటూ రాయడం ప్రారంభించారు. జైలు నుంచి రాగానే కొందరు జైలు డైరీ రాసి ఉంటే, తాము ప్రచురిస్తామని చెప్పారు. అవకాశం వస్తే చూద్దాం అని చెప్పాను. జెఎన్‌యూలో జరిగిన దానికి పలు అన్వయాలు, వివరణలు వెలువడ్డాయి. దీనితో తలెత్తిన పలు ప్రశ్నలకు మా సమాధానం ప్రజలకు వెళ్లాల్సి ఉందని గుర్తించే ఈ పుస్తకం తీసుకువచ్చాను. అయితే ఇది జీవిత చరిత్ర కాదు. రాజకీయ యాత్రలో జ్ఞాపకాల సంపుటి.

ప్ర: ఈ పుస్తకంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు ఎక్కువ గా పార్టీ వైఖరికి అనుగుణంగా ఉన్నట్లున్నాయి. పార్టీ వర్గాలు ఈ పుస్తకాన్ని ఆమోదించినట్లేనా?
జ: పార్టీలో భాగంగా పుస్తకం వస్తే దీనిని జాగర్‌నా వా రు ప్రచురించి ఉండరు. ఈ పనిని పీపుల్స్ పబ్లికేషన్ హౌజ్ వారు చేపట్టి ఉండేవారు. అయినా నేను పార్టీ సభ్యుడిని కాను. ఇక పుస్తకానికి పార్టీ ఆమోదం కానీ నిరాకరణ కానీ అవసరం ప్రసక్తే రాదు.

ప్ర: పిహెచ్‌డి తరువాత రాజకీయ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా?
జ: లేదు. ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అయితే నేను జైలు కు వెళ్లినప్పుడు ఈ పుస్తకం రాయాలని అనుకోలేదు. అదే విధంగా ఈ దశలో ఇప్పటికైతే ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదు.

ప్ర: దేశంలో ఇప్పుడు గణనీయంగా మితవాద దృక్ప థం ఉంది. వామపక్షాలు ప్రజల వద్దకు చేరుకోవ డంలో విఫలం అయినట్లు భావిస్తున్నారా?

జ: ఇక్కడ హిందువులు, హిందూత్వ మధ్య తేడాలను గుర్తుంచుకోవల్సి ఉంటుంది. మేం ఎప్పుడూ మతం పై రాజకీయ ఆధిపత్యం లేకుండా చేసేందుకు య త్నించాం. అయితే ఈ పనిని మేం సమర్థవంతంగా చేయలేకపొయ్యాం. చేసి ఉంటే బిజెపి అధికారం లోకి వచ్చి ఉండేది కాదు. ఇక్కడో విషయం చెప్పాలి. బిజెపి ప్రత్యర్థిని ఓడించి గెలిచింది. కానీ గణాంకాల మేరకు చూస్తే 69 శాతం మంది ప్రజలు బిజెపిని ఇష్టపడలేదని ఓట్ల శాతం బట్టి చూస్తే వెల్లడైంది. దేశం ఉమ్మడి అంతరాత్మగా మతం ఉంది. కానీ ఇది ఘర్షణాయుత మతవాదం కాదని చెప్పవచ్చు. ప్రజలు హిందువులే. అయితే హిందూ రాష్ట్రం కావా లని కోరుకోవడం లేదు. వారు రాజ్యాంగం, లౌకి కత, ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారు. ఈ ఆలోచనల తో ఉండే ప్రజలను అర్థం చేసుకుని. వారి వైఖరిని గ్రహించి వారికి అర్థం అయ్యే రీతిలో అనుసంధానం కావల్సిన అవసరం ఉంది.

ప్ర: తరచూ జై బీమ్, లాల్‌సలాం నినాదాలకు దిగు తూ వచ్చారు కదా…అంబేద్కరీయ రాజకీయాలపై మీ అవగావహన ఏమిటీ?
జ: ఎలాంటి గుత్తాధిపత్యాన్ని అయినా నేను వ్యతిరేకి స్తాను. ఆర్థిక గుత్తాధిపత్యం కానీ, మేధావుల ఆలోచ నలపై గుత్తాధిపత్య చాటుకునే వైఖరిని కానీ అంగీక రించేది లేదు. నేను గాంధీ,వివేకానంద,గురునానక్ లను స్ఫూర్తిగా తీసుకుంటాను. వారు కేవలం ఓ వర్గానికో, ఏక గుర్తింపునకో ప్రతీకలు కాదని భావి స్తున్నాను. యావత్ సమాజ అభ్యున్నతికి ఎలుగెత్తిన గొప్ప ఆలోచనాపరులు. అంబేద్కర్ కేవలం దళితు లకే చెందిన వాడు, వారి గురించే పాటుపడ్డవాడు అనుకోరాదు. ఆయన దళితుల సమస్యల గురించి మాట్లాడుతూనే, ఆర్థిక అంశాలను ప్రస్తావించారు. రైతాంగ, కార్మిక, మహిళల సమస్యలను వెలుగు లోకి తెచ్చారు. అందరికోసం స్పందించిన ఆలోచనా పరులను కేవలం ఓ ఉద్యమానికో ఓ వర్గానికో పరిమితం చేయడం సరికాదు. అది వారిని కించప ర్చడమే అవుతుంది. నేటి యువతకు ఏ సిద్ధాంతం కూడా పూర్తి స్థాయి సమాధానాలను ఇవ్వలేదు. విస్తృతస్థాయి సిద్ధాంత ఐక్యత అవసరం. మార్కి జం, అంబేద్కరిజం మధ్య సారూప్యతలు ఉన్నాయి. రెండూ సమానతలను ప్రబోధిస్తాయి. వ్యవస్థలను సవాలు చేయడం, దోపిడీలను ప్రశ్నించడం, వాటిని అంతం చేయడంలో ఏకాభిప్రాయం ఉంది.

ప్ర: మీ పుస్తకంలో ఓ చోట అన్ని వర్గాలకు కుల ప్రాతి పదికన ప్రాతినిధ్యం కల్పించడం సముచితం కాద ని ప్రస్తావించారు కదా?
జ: భారతదేశంలో సామాజిక న్యాయం కోసం జరుగు తున్న పోరులో పలు సవాళ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది తాత్కాలిక ఉపశమన ధోరణి. మనం చివరికి సామాజిక న్యాయాన్ని ఎన్నికల నినాదంగా, ఓట్ల రాజకీయ అస్త్రంగా మలిచాం. ఓ వ్యక్తి ఎంపిగా నో ఇతరత్రా నాయకుడిగానో మారగానే సమాజం ఉద్ధరింపబడదు. అయితే ఈ పరిణామంతో ఓ వర్గా నికి చెందిన నాయకుడి ఉన్నతి జరగవచ్చు. మోడీజీ దేశానికి ప్రధాని అయ్యాడు అయితే ఛాయ్ వాలాల కు దీని వల్ల ప్రయోజనం ఏమీ జరగలేదు. వారి పిల్ల లు మంచి స్కూళ్లకు వెళ్లడం లేదు. గుత్తాధి పత్యం ఎక్కడున్నా ఎదిరించాల్సిందే. అబేంద్కరీయ రాజకీ యాలు, వామపక్ష, మితవాద ఈ విధంగా ఏ ఆధి పత్య ధోరణిని అయినా ఎదిరించాల్సినవసరం ఉంది.

ప్ర: వామపక్ష ఐక్యత అసాధ్యం అనుకుంటున్నారా?
జ: మీరో నేనే కోరుకుంటే ఐక్యత అనేది సాధ్యం కాదు. దీనికి సరైన నిర్మాణాత్మక పరిస్థితులు ఉండాలి. ప్రజలు ఎప్పుడైతే ప్రభావిత దశలో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారో స్వయంగా స్పందించి ఐక్య తను కోరుకుంటారు. యూనివర్సిటీ క్యాంపస్‌లలో జరుగుతున్నదేమిటీ? ఎబివిపికి రాజ్యాధికారం ఉంది. వారు ప్రజలను అంటే దళితుల, మైనార్టీలు, రాజకీయేతర ఉదార వాదులను వ్యక్తులను లక్షం గా చేసుకుని దాడులకు దిగుతున్నారు. ఇలాంటి అణచివేత సాగుతూ పోతూ ఉంటే చివరికి నిస్సహా యత స్థితిలో నుంచే ఐక్యత ఏర్పడుతుంది. బీహార్ లో నితీష్, లాలూ ప్రసాద్‌లు కలవడం ఓ ఉదాహ రణ. ప్రజలు కలిసిరాని చోట్ల చివరికి ఓడిపోతున్నదీ ప్రజలే. రాజ్యాంగ మౌలికతను దెబ్బతీసే యత్నాలు జరుగుతున్నాయి. ఐక్యత అనేది కేవలం చిత్తానికి సంబంధించినదే కాదు. ఇది అత్యవసరం కూడా. ఐక్యతకు ఉమ్మడి కారణాలు అవసరం. భావ వ్యక్తీక రణపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరు సల్పాల్సి ఉంది. రాజకీయ అభిప్రాయాలు వేర్వేరు అయినా ఉమ్మడి కారణంతో ఐక్యంగా వ్యవహరించేందుకు వీలుంది. ఎవరైనా ప్రజాస్వా మ్య ప్రియులు, రాజ్యాంగ అనుకూలురు, పలురకా ల బెదిరింపులకు గురి అవుతున్నాం అనుకుంటే సహజంగా అదే ఐక్యతకు దారితీస్తుంది. ఇది తక్షణావసరం.