Home అంతర్జాతీయ వార్తలు ఆకాశాన్నంటిన పెట్రోల్, డీజిల్ రేట్లు..!!

ఆకాశాన్నంటిన పెట్రోల్, డీజిల్ రేట్లు..!!

PETROL-IMAGE

న్యూఢిల్లీః  పెట్రోల్, డీజిల్ రెట్లు మరో సారి పెరిగి ఆకాశాన్నంటాయి. మానవుని మనుగడకు అత్యంత ప్రధానమైన నిత్యవసర వస్తులల్లో పెట్రోల్, డీజిల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అలాంటప్పుడు వాటి రేట్లు పెరిగితే…. ఆ ప్రభావం  సామాన్యుడిపై  పడుతుందనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఓక్కసారిగా పెరగడంతో ఆ  ఎపెక్ట్ మన దేశంపైనా పడింది. మంగళవారం డిజిల్ రేట్లు ఆల్‌టైమ్ రికార్డులను అంటాయి. పెట్రోల్ రేట్లు మూడేళ్ల గరిష్ఠానికి  చేరుకున్నాయి. మంగళవారం న్యూఢిల్లీలో డిజిల్ రేటు లీటర్‌కు రూ.61.88 కాగా.. పెట్రోల్ రేటు రూ.71.27గా ఉంది. ఇక హైదరాబాద్‌లో డిజిల్ రేటు రూ.67.08గా ఉండగా.. పెట్రోల్ రేటు ఏకంగా రూ.75.37కు చేరింది. ఆగస్ట్ 2014 తర్వాత పెట్రోల్ రేటు ఇంత పెరగడం ఇదే  మొదటి సారి. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మంగళవారం పెట్రోల్ రేట్లు లీటర్‌కు 9 పైసలు, డిజిల్ రేట్లు 14 నుంచి 16 పైసల వరకు పెరిగాయి. పెట్రోల్ ధర అత్యధికంగా ముంబైలో రూ.79.15కు చేరడం గమనార్హం. డిసెంబర్ 2014 తర్వాత తొలిసారి బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 70 డాలర్లను దాటింది. ముడి చమురు అవసరాల కోసం భారతదేశం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడటం వల్లనే అంతర్జాతీయ ధరల తీవ్రత మనపై పడుతుందని నిఫుణులు తెలిపారు. రేట్లు పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కనబడుతున్నాయి.

1. ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియమ్ ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), రష్యా, ఇతర ఉత్పత్తి దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు క్రూడాయిల్ ఉత్పత్తి భారీగా పడిపోయింది . దీంతో ధరలు పెరుగుతున్నాయి. 

2. ఇక డాలర్ బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. 

3. పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రభుత్వంపై ఎక్సైజ్ డ్యూటిని లీటర్‌కు రూ.2 తగ్గించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.26 వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది.

4. ఢిల్లీలో పన్నులను తగ్గించినా కూడా గత సంవత్సరం జూన్ నుంచి పెట్రోల్ ధరలు 7 శాతం, డిజిల్ ధరలు 10 శాతం మేర పెరిగాయి.