Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఆఫీసా.. అదొక ప్రపంచం

Office-image

మనం చేసే ఆఫీసులో మన సహోద్యోగి స్థానం ఏమిటి? స్నేహితుడిగా అనుకోవాలా ? శ్రేయోభిలాషిగా గౌరవించాలా? పోటీదారుడిగా పరిగణించాలా? అసలు ఆ వ్యక్తి ఉనికినే విస్మరించాలా? వారితో ఎలా మాట్లాడాలో , ఏం మాట్లాడాలో అర్థంకాక కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఎన్నో సందేహాలు. ఓ కొత్త కుర్రాడు సహోద్యోగిని ఆత్మీయుడిగా భావించి తనకున్న ఆలోచనల్ని పంచుకున్నాడు. కానీ వాటిని తన ఆలోచనగానే నమ్మించి బాస్ దగ్గర ప్రమోషన్ కొట్టేస్తారు కొంతమంది సీనియర్స్. ఓ ట్రైనీ అమ్మాయి క్యాంటీన్‌లో తన తోటి సీనియర్స్‌తో హాస్యానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలను చేసుంటే..వారు వాటిని మెమో దాకా తీసుకెళ్తుంటారు కొందరు ముదురు ఉద్యోగులు. తప్పుల్ని సరిదిద్ది సహకరించేవారూ, ధైర్యమిచ్చి ప్రోత్సహించేవారూ, వేలు పట్టుకొని ముందుకు నడిపించే వారూ చాలా తక్కువ మంది ఉంటారు. ఆఫీసంటే అదో బుల్లి ప్రపంచం.

సమాజంలో ఉన్నట్టే, అక్కడా రకరకాల మనుషులుంటారు. తప్పదు అందర్నీ భరించాల్సిందే. ఒకరు ఆశావాదులు. మరొకరు నిరాశావాదులు. కొందరు పని దొంగలు, మరికొందరు పని రాక్షసులు, ఎవర్నుంచి ఏకాస్త నేర్చేసుకోవాల్సింది ఉన్నా.. నేర్చుకుని ముందుకెళ్లిపోవడమే . సాధ్యమైనంత వరకూ ఇగోలనే తేనేతుట్టెల్ని కదపకపోవడమే మంచిది.ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్యలు దూరం అవుతాయి. సహోద్యోగి సంబంధాలకూ వర్తించే సూత్రమిది.

Comments

comments