Home జాతీయ వార్తలు వివిధ రకాల మండపాల్లో దుర్గాదేవి

వివిధ రకాల మండపాల్లో దుర్గాదేవి

Durga-Mandap-1హైదరాబాద్ : వినాయక చవితి అయిన దేవీ నవరాత్రులైన రెండింటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి దేవతలను ప్రతిష్టించే మండపాలు. తమకు తోచినంతలో, వైవిధ్యంగా మండపాలను భక్తులు ఏర్పాటు చేస్తుంటారు. దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. కోల్‌కత్తలో దుర్గా మతాను ప్రతిష్టించిన మండపాన్ని భక్తులు వైవిధ్యంగా అలంకరించారు. మృదంగాలు, తబలాల ఆకారంతో మండపాన్ని నిర్మించి మాతను అందులో ప్రతిష్ఠించారు. అస్సాంలోని నాగాంన్ జిల్లాలో వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడి రూపంలో దుర్గా మాత మండపాన్ని నిర్మించి అక్కడి వారు తమ భక్తిని చాటుకున్నారు.

Durga-Mandap-2