Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బ్యాంక్ ఖాతాదారులకు కష్టాలు

 Difficulties to bank clients in Nizamabad District

మన తెలంగాణ/జుక్కల్: తమ డబ్బులు బ్యాంకు లో భద్రంగా ఉంచుకుని కావల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చని ప్రజలు బ్యాం కుల్లో జమా చేయడం అందరికి తెలిసిన విషయమే కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్ళాలంటేనే అమ్మో బ్యాంకా….? అనే మాట ప్రతివారి నోట వినిపిస్తుంది. ఆ విధంగా బ్యాంక్ కష్టాలు ఉంటున్నాయి మరి. జుక్కల్ మండలంలో ఉన్న ఎస్‌బిఐ బ్యాంకులో ఎప్పు డు చూసినా ప్రజలు క్యూ లైన్ కట్టి ఉంటారు. కారణం అక్కడ ఒకే కౌంటర్ ఉండటం, దానికి తోడు డబ్బులు కూడా మద్నూర్ బ్యాంకు నుంచి తీ సుకురావడం, అది కూడా ఆలస్యం అవుతుండటంతో బ్యాంకు పని పెట్టుకుంటే ఒక రోజు దానికే కేటాయించాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యేదైనా తెలియని విషయం బ్యాంకు మేనేజరుతో మాట్లాడుదామన్నా ఆయన కేబిన్‌లోనే పరిమితమౌతారు. లోనికి ఎవరికి కూడా అనుమతించరు. ఎ వరితో మాట్లాడాలని కూడా చూడరు. అవసరమునాన్న లేకున్నా కంప్యుటర్‌లోనే మొఖం పెట్టి తదేకంగా చూస్తూ తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వరని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో డబ్బులు లేవని ఒకొక్క రోజు పరిమితంగా తీసుకెళ్ళాలని సూచించడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. పంటలు కొనుగోలు చేసిన ప్రభుత్వం రైతల డబ్బులు బ్యాంకులో జమా చేశారు. వారికి రావల్సిన డబ్బులు రోజుకి రెండు నుంచి ఐదు వేల చొప్పున తీసుకెళ్ళాలని సూచిస్తే వారు పనులు చేసుకోవాలా…? లేక బ్యాంకు చుట్టు తిరగాలా అని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు మేనేజర్ తీరు పట్ల ప్రతి ఒక్కరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కండిషన్లు పెట్టి తమకు ఇబ్బందుల పాలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. అయితే క్యూ లైన్ అధికంగా కనిపించకూడదంటే రెండు వేర్వేరు కౌంటర్లు (డెబిట్, క్రెడి ట్) అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇంకా డబ్బులు అవసరమనుకుని ఏటిఎంలోనైనా తీసుకుందామంటే అది ఎప్పుడు కూడా పని చేయదు. ఉన్న మరో ఏటియం మూసేశారు. ఖాతాదారుల కష్టాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవని వారు హేళన చేస్తున్నారు.
మరో బ్యాంకు అవసరం:
మండల కేంద్రంలోని ఎస్‌బిఐతో పాటు ప్రత్యామ్నాయంగా మరో బ్యాంకు అవసరమని రైతులు పేర్కొంటున్నారు. ఎటువంటి లావాదేవిలు ఉన్న తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని అసహనం వ్య క్తం చేస్తున్నారు. మండలంలోని రెండు పెద్ద లావాదేవిలైన పెట్రోల్ పంపు, వైన్స్‌ల డిడిలతోనే మండలంలోని ప్రజలకు డబ్బులు ఇస్తున్నారని వేరే మద్నూర్ నుంచి డబ్బులు తీసుకువచ్చి అదనంగా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
గ్రామస్తులు కూడా ఇతర బ్యాంకు అవసరమని అంటూనే వారికి తగిన సహాయం చేయడం లేదని డ బ్బులున్నవారు పెట్టుబడి పెట్టేలా అధికారులు కృషి చేయడం లేదని వాపోతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి వేరే బ్యాంకును ఏర్పాటు అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

Comments

comments