Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రాత్రివేళ ఇంట్లోకి చొరబడ్డ దిగంబర స్వామి

Digambara-Swami

చెన్నై: దిగంబర స్వామిగా పిలువబడే ఓ వ్యక్తి రాత్రివేళ ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. దీంతో ఇంట్లో మహిళలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిశెట్టి పాళయంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కొళ్లపల్లూరు కన్నకుళి అనే చోట చిన్న ఆలయం వద్ద ఓ వ్యక్తి తాను దిగంబర స్వామిని అంటూ తిష్టవేశాడు. ఆయనకి పల్లావరానికి చెందిన సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి సపర్యాలు చేస్తూ శిష్యుడిగా ఉంటున్నాడు. సదరు దిగంబర స్వామి చుట్టూపక్కల పొలాల్లో నగ్నంగా తిరుగుతూ నీటి తొట్టెల్లో జలకాలాడుతున్నాడు.

దీంతో ఒక రోజు ఆయన వద్దకు స్థానికులు వెళ్లగా చేతికి అందిన వస్తువులను వారిపై విసిరి కొట్టాడు.  కానీ శిష్యుడు మాత్రం స్వామి అలా విసిరినప్పుడు ఆ వస్తువు ఎవరికి తాకితే వాళ్లు ధనవంతులు కావడంతోపాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని స్థానికులను నమ్మించాడు. ఇక అప్పటి నుంచి ప్రతి రోజు స్వామి వద్దకు జనాలు బారులు తీరడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి మహిళలు అధికంగా ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇది గమనించిన మహిళలు బిత్తర పోయారు. ఒంటిపై నూలు పొగులేకుండా నెలపై పడుకోవడాన్ని చూసిన మహిళలు ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ బయటకు పరుగులు తీశారు.

దాంతో స్థానికులు గుమ్మిగుడారు. ఇది గమనించిన ఆ స్వామి, శిష్యుడు అక్కడి నుంచి పారిపోయారు. అయితే స్థానికులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఓ వ్యక్తి తనకు సంబంధించిన స్థలాన్ని అమ్మకాన్ని పెట్టగా అది అమ్ముడు పోలేదు. దాంతో ఈ స్వామిజీని అక్కడకు రప్పించినట్లు తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Comments

comments