Home కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా డిజిటల్ జిల్లా కేంద్ర గ్రంథాలయం

స్మార్ట్ సిటీలో భాగంగా డిజిటల్ జిల్లా కేంద్ర గ్రంథాలయం

digital-city-center-library-is-part-of-smart-city

కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్

మనతెలంగాణ/కరీంనగర్: స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంను డి జిటల్ గ్రంథాలయంగా అభివృద్ధి పర్చుటకు గాను నిధులు సమకూర్చనున్నట్లు ఎంపి బి.వినోద్ కుమార్, ఎం ఎల్‌ఎ గంగుల కమలాకర్‌లు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంను వారు సందర్శించి పాఠకులకు కావలసిన వసతులు,పుస్తకాలు,కంప్యూటర్లు,రీడింగ్ కుర్చీలు వెంటనే కొనుగోలు నిమిత్తము నిధులు మ ంజూరు ఇవ్వగలరని తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలోని దుకాణ సముదాయంలోని అన్ని దుకాణాలను పెద్దహాల్స్‌గా మా ర్పుచేసి, ఒక హాలులో పాఠకుల సౌకర్యార్థము కోచింగ్ సెంటర్, మరి యొక్క హాల్‌లో చిన్న పిల్లలు, మహిళల కొరకు ప్రత్యేక విభాగము, ఒక హాల్‌లో ఇంటర్నెట్ విభాగం,విద్యార్థిని, విద్యార్థులు తమ సొంత పుస్తకములు చదువుకొను నిమిత్తం ఒక హాలు,అంతే కాకుండా ఒక మీటింగ్ హాలుగా తీర్చిదిద్దుటకు చర్చ తీసుకోబడుతున్నదని సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి ఎంపి వినోద్‌కుమార్‌కు వివరించారు. రూ.30లక్షలు మంజూరు అవసరము కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేశ్, కార్పొరేటర్లు వై. సునీల్‌రావు, ఎండి అరీఫ్, బోనాల శ్రీకాంత్, కర్ర సూర్య శేఖర్,జక్కుల నాగరాజు,శ్రీనాథ్, ద్యావ మధుసూదన్ రెడ్డి, ఎం.డి ఫహాద్, రాజు, శ్రీలత, రవీందర్‌రెడ్డి,నాగభూషణం,గౌతమి,తిరుపతి,సంపత్,సుమన్, విద్యార్థిని, విద్యార్థులు,పాల్గొన్నారు