Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

పాసు పుస్తకాల డిజిటల్ సంతకాల ప్రక్రియను వేగవంతం చేయాలి

digital signature of pass books should be accelerated

ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ తివారీ

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : ఆధార్ సీడింగ్ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల డిజిటల్ సంతకాల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ తివారీ కలెక్టర్‌లను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల ప్రింటింగ్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకం పూర్తయిన వాటిని ప్రింటింగ్ కోసం పంపాలని, ఖాతా మెర్జింగ్, మ్యూటేషన్, ఫిర్యాదులలోని కరెక్షన్‌లను సత్వరం పూర్తి చేయాలని సూచించారు. ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలను సంబంధిత ఆర్‌డీఓలను, తహసీల్దార్‌లతో మండలాల వారీగా పరిష్కరించాలని అన్నారు.  కలెక్టర్ ఎంవి రెడ్డి, జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ విజయకుమారి,ఆర్‌డీఓలు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

Comments

comments