Home తాజా వార్తలు దిగ్విజయ్ క్షమాపణ చెప్పాలి : నాయిని

దిగ్విజయ్ క్షమాపణ చెప్పాలి : నాయిని

NAINIహైదరాబాద్ : తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్‌పై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై తమ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన స్పష్టం చేశారు. దిగ్విజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాయిని హెచ్చరించారు.