Search
Wednesday 21 November 2018
  • :
  • :

దిల్ రాజుతో మహేష్ ‘ఫైట్’…!

Mahesh Maharshi

టాలీవుడ్ లో సినిమా కథల పట్ల మంచి అభిరూచి గల నిర్మాతల్లో దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. కుటుంబ కథలతో పాటు యువతను కనెక్ట్ అయ్యే స్టోరీలను ఎంచుకోవడంలో దిల్ రాజు సిద్ధహస్తుడు. అలాగే కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో కూడా ఆయన ముందుంటాడు. చిత్రం హిట్, ప్లాప్ అనే దానితో సంబంధం లేకుండా డైరెక్టర్ టాలెంట్ పై నమ్మకంతో ముందుకెళ్తుంటాడు. అయితే, 2018 దిల్ రాజుకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాదిలో వచ్చిన లవర్, శ్రీనివాస కళ్యాణం వరుస డిజాస్టర్లు కాగా, దసరా కానుకగా వచ్చిన హాలో గురు ప్రేమకోసమే.. పర్వాలేదనిపించింది.

ఇలా అతను తీసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. దాంతో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబోలో చేస్తున్న ‘మహర్షి’ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలనీ రాజు కృతనిశ్చయంతో ఉన్నారట. దీంతో సినిమా కథ విషయం చాలా జోక్యం చేసుకుంటున్నాడనేది బయట వినిపిస్తున్నటాక్.

అసలు విషయం ఏమిటంటే…  ‘మహర్షి’ కథ ప్రకారం ఇందులో రెండు ఫైట్లకే అవకాశం ఉందట. సినిమాలో ఎక్కువభాగం సెంటిమెంట్ కంటెంట్ – కామెడీ–రొమాన్స్ తో సాగుతుందట. అయితే, దిల్ రాజు మాత్రం ఈ మూవీలో మరో రెండు పోరాట సన్నివేశాలను పెట్టాల్సిందేనని పట్టుబడుతున్నాడట. దీనికి కారణం.. రాజు మాస్టర్ ప్లాన్ అని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రానికి భారీ మొత్తం రావాలంటే యాక్షన్ డోస్ చాలా అవసరమనేది రాజ్ ప్లాన్. ఇలా చేస్తే హిందీ డబ్బింగ్ రైట్స్ నుండి సుమారు పాతిక కోట్లు వస్తాయని రాజు ఆశిస్తున్నాడట.

దీంతో వంశీకి ఆ దిశగా ఆలోచించాలని, కథలో కొద్దిపాటి మార్పులు చేసిన పర్వాలేదని చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, మహేష్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట. స్క్రిప్ట్ ప్రకారం రెండు ఫైట్లు సరిపోతాయని, అనవసరంగా కొత్త ఫైట్లు జోడించడం వల్ల మూవీ అసలు కథ జనాలకు కనెక్ట్ కాకపోవచ్చని మహేష్ అంటున్నాడట. ప్రస్తుతం ఈ విషయమై మహేష్ – దిల్ రాజు మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది.  మహేష్, దిల్ రాజుల మధ్య ఈ ఫైటింగ్ చిచ్చు ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.

Dil Raju Controversy with Mahesh Babu on Maharshi

Telangana Breaking News

Comments

comments