Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

త్రివిక్రమ్ దర్శకత్వంలో దిల్‌రాజు చిత్రం

dil-rajuఅటు ప్రేమ కథలను ఇష్టపడే యువతను… ఇటు కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా కథలను రూపొందించుకొని చక్కటి చిత్రాలను తీయడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ది అందెవేసిన చేయి. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘అ…ఆ’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌రాజు… తివిక్రమ్‌తో ఒక భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ “త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పెద్ద స్టార్ హీరోతో ఓ సినిమా చేయబోతున్నాం. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో నాకు ‘నువ్వే కావాలి’ సినిమా రోజుల నుండి మంచి స్నేహం ఉంది. సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు మా బ్యానర్‌లో ఆయనతో ఒక భారీ సినిమా తీయబోతున్నాం. ఇక జూన్ నెలలో పెద్ద సినిమా సక్సెస్ అయిన చరిత్ర లేదు. అటువంటి ట్రెండ్‌ని కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది. కేవలం ఒక వారంలో డిస్ట్రిబ్యూటర్‌లకు డబ్బులు తిరిగి రావడం అనేది ఈమధ్య కాలంలో ఏ సినిమాకు జరగలేదు. ఇంతటి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్, నిర్మాత చినబాబుకు నా అభినందనలు”అని అన్నారు.

Comments

comments