Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

విరాట్ వల్లే నా ఉద్యోగం ఊడింది..!

Dilip-Vengsarkar-and-Virat-

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రస్తుతం భారత జట్టుకు ఒంటిచేత్తో విజయాలందిస్తున్నాడు విరాట్. ఫార్మాట్ ఎదైన దూకుడుగా ఆడటమే కోహ్లీ సక్సెస్ మంత్రగా మారిపోయింది. అయితే ఇలాంటి విజయ సారథిని ప్రారంభంలో భారత జట్టులోకి ఎంపిక చేసినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించారని మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి రచించిన ‘డెమోక్రసీ ఎలెవన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంగ్‌సర్కార్ తన బిసిసిఐ చీఫ్ సెలక్టర్ ఉద్యోగం ఎలా పోయిందో వ.

2008లో విరాట్ నేతృత్వంలోని అండర్-19 జట్టు వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. దీంతో ఆ టోర్నీలో అద్భుతంగా రాణించిన కోహ్లీని తమిళనాడు క్రికెటర్ బద్రీనాథ్ స్థానంలో భారత జట్టుకు ఎంపిక చేశాను. కాని నేను చేసిన ఈ మార్పు బోర్డులో కొందరికి నచ్చలేదు. దీంతో అప్పటి బిసిసిఐ ప్రెసిడెంట్ శరద్ పవార్‌కు బోర్డు ట్రెజరర్, తమిళనాడు క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ నాపై ఫిర్యాదు చేశారు. దాంతో విరాట్‌ను జట్టులోకి తీసుకున్న మరుసటి రోజే నన్ను చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తొలగించిన్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. అయితే, నా ఉద్యోగం పోయినా.. నేను ఎంపిక చేసిన జట్టులో మాత్రం కోహ్లీని అలాగే కొనసాగించారంటూ వెంగ్‌సర్కార్ తన చీఫ్ సెలక్టర్ పదివి పోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Comments

comments