Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

స్వర్ణ పతకం సాధించిన దీపా కర్మాకర్…

Geetha
మెర్సిన్: టర్కీలోని మెర్సిన్ వేదికగా జరిగిన ఎఫ్‌ఐజి వరల్డ్ ఛాలెంజ్ కప్‌లో జిమ్నాస్టిక్స్ విభాగంలో దీపా కర్మాకర్ స్వర్ణ పతకాన్నిసాధించింది. రెండేళ్ల పాటు గాయం కారణంగా జిమ్నాస్టిక్స్‌కి దూరమైన దీపా తిరిగి యాక్షన్‌లోకి అడుగుపెట్టగానే అదరగొట్టింది. 14.150 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించింది. బ్యాలెన్స్ బీమ్ విభాగంలో 11.850 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ముగిసింది. రియో ఓలింపిక్స్‌లో నాలుగో స్థానంలో ముగించిన ఆమె ఆ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకుంది. ఈ కారణంగా దీపా 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌కి కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం.

Comments

comments