హైదరాబాద్ : ‘RX100’ సినిమా దర్శకుడు అజయ్ భూపతి పెళ్లి శనివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిరీష అనే యువతిని అజయ్ పెళ్లి చేసుకున్నారు. ఆయనది పెద్దలు కుదుర్చిన ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. అజయ్ పెళ్లికి ‘RX100’ హీరో కార్తికేయ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అజయ్ పెళ్లి సందర్భంగా తీసిన ఫొటోలను కార్తికేయ ట్విటర్ లో పోస్టు చేశారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వద్ద అజయ్ భూపతి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తన తొలి సినిమా ‘RX100’తో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించగా, అశోక్‌రెడ్డి నిర్మించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. జులై 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.