Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

దర్శకురాలు జయ ఇకలేరు

Jaya

హైదరాబాద్: టాలీవుడ్ లో ప్రముఖ దర్శకరాలు బి జయ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత రాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయ చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2003లో సినీ రంగంలోకి ప్రవేశించారు. చంటిగాడు అనే సినిమాకు దర్శకత్వం వహించారు.  గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం లాంటి చిత్రాలకు జయ దర్శకత్వం వహించడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇవాళ సాయంత్రం పంజాగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.  నటుడు సాయి ధరమ్ తేజ్ జయ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. బిఎ రాజు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. జయ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

Comments

comments