Home తాజా వార్తలు సినీ విమర్శకుడు శాస్త్రి ఇకలేరు

సినీ విమర్శకుడు శాస్త్రి ఇకలేరు

Sastri

Director KNT Sastri Passes Away

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు, సినీ విమర్శకుడు కెఎన్టి శాస్త్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయన పలుమార్లు జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. తిలదానం, సురభి(డాక్యుమెంటరీ) సినిమాలకు నంది అవార్డు కూడా ఆయనను వరించింది. శాస్త్రి పలుమార్లు పెద్ద నటులతో బ్లాక బస్టర్ సినిమాలు తీయడం కంటే సందేశాత్మక చిత్రాలు తీయడానికే తొలి ప్రాధాన్యం ఇస్తానని ఇంటర్య్వూలో తెలిపారు. 2006లో నందితా దాస్‌ హీరోయిన్‌గా శాస్త్రి తెరకెక్కించిన కమిలి చిత్రాన్ని దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించిన విషయం తెలిసిందే.