Home తాజా వార్తలు దర్శకుడు కోడి రామకృష్ణకు అస్వస్థత

దర్శకుడు కోడి రామకృష్ణకు అస్వస్థత

 

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలో కూడా పెరాలసిస్‌తో కొంత కాలం బాధ పడిన కోడి రామకృష్ణ.. ఆ తర్వాత కోలుకున్నారు.

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలను కూడా తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలందరితోనూ సినిమాలు రూపొందించిన కోడి రామకృష్ణ ఎన్నో బ్లాక్ బ్లస్టర్ సినిమాలను అందించారు. కాగా, 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.

Director Kodi Ramakrishna Hospitalised in Hyderabad