Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కేరళ సిఎం సహాయ నిధికి కొరటాల విరాళం

Director Koratala Gave Donation to Kerala CM Relief Fund

హైదరాబాద్ : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 167మందికి పైగా చనిపోయారు. వందేళ్ల తరువాత ఇంతటి భారీ వర్షాలు కురుస్తుండడంతో కేరళ ప్రజలకు యావత్ దేశం అండగా నిలుస్తోంది. కేరళ సిఎం సహాయ నిధికి సినీ ప్రముఖులు కమల్‌హాసన్, సూర్య, కార్తి, అల్లు అర్జున్, సిద్దార్థ, విజయ్ దేవరకొండ తదితరులు ఇతోధికంగా విరాళం ఇచ్చారు. ప్రముఖ తెలుగు దర్శకుడు కొరటాల శివ కూడా కేరళ సిఎం సహాయ నిధికి మూడు లక్షల రూపాయలను విరాళంగా అందించారు. యావత్ భారత్ కేరళ ప్రజలకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా కేరళలోని 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక్క కాసర్‌ఘడ్ జిల్లాలో మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు కేంద్రం సమీక్ష చేస్తోంది.

Director Koratala Gave Donation to Kerala CM Relief Fund

Comments

comments