Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కంగనతో క్రిష్ చారిత్రక చిత్రం

Kangana-And-Krish

బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ ఇప్పటికే తన టాలెంట్‌ను చాలా సార్లు నిరూపించుకుంది. ఇంత సాధించినా ఆమెకు ఇంకా డ్రీం ప్రాజెక్ట్ ఒకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాణి లక్ష్మీబాయి జీవితంపై తెరకెక్కే సినిమాలో లీడ్ రోల్ చేయాలనేదే తన కోరికట. ఒకానొక దశలో తనే స్క్రిప్ట్ రాసుకొని ఆ సినిమాను తనే డైరెక్షన్ చేస్తానని కూడా చెప్పింది. దీంతో ఆ పాత్రపై ఆమెకు ఎంత మక్కువో అర్థమవుతుంది. అయితే కేతన్ మెహతా దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో అంతా అనుకున్నారు. ఈమేరకు కొంత వర్క్ కూడా జరిగింది. కానీ అప్పుడు ఆగిపోయిన ఆ ఆలోచన ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేయగా… టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ చేతికి ఆ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చూడాలంటూ  రాజమౌళి తండ్రి అయిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఓ సమయంలో కంగనకు చెప్పాడు. దీంతో ఈ సినిమాను చూసిన కంగనకు క్రిష్ టాలెంట్ ఏంటో అర్థమై కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిందట. క్రిష్‌కు రాజమౌళికి ఉన్న సాన్నిహిత్యంతో విజయేంద్ర ప్రసాద్ ద్వారా ఈ ప్రాజెక్ట్ క్రిష్ చేతికి రావడానికి తోడ్పడిందని అంటున్నారు. రాణి లక్ష్మీబాయి అసలు పేరైన ‘మణికర్ణిక’ అనే టైటిల్‌పై ఈ చిత్రం తెరకెక్కనుండగా క్రిష్ సొంత బ్యానర్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ చిత్రం రూపొందనుంది. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ మరోసారి చారిత్రక చిత్రం చేయనుండడం విశేషం.

Comments

comments