Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మణిరత్నంతో నాని చిత్రం

Nani

యంగ్ హీరో నాని ఇప్పుడు తెలుగులో గొప్ప సక్సెస్ ఉన్న కథానాయకుడిగా రాణిస్తున్నాడు. వరుస సినిమా విజయాలతో అటు అభిమానులను ఇటు నిర్మాతలను ఆనందపరుస్తున్నాడు. నేను లోకల్, నిన్ను కోరి సినిమాల విజయాల తర్వాత చేస్తున్న ‘ఎంసిఎ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమాలో అతనికి జంటగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఎంసిఎ డిసెంబర్‌లో విడుదలకానుంది. ఇకపోతే నాని నటిస్తున్న మరో చిత్రం ‘కృషార్జున యుద్ధం’ వచ్చే ఏడాది వేసవిలోపు విడుదలకావచ్చని తెలిసింది. ఈ రెండు సినిమాలతో పాటు మరో బిగ్ మూవీకి కూడా ఓకే చెప్పాడట నాని. దేశంలోనే గొప్ప దర్శకుడు అయిన మణిరత్నంతో ఈ యంగ్ స్టార్ ఓ సినిమా చేయబోతున్నాడట. మణిరత్నం ఇప్పటికే నానీకి ఓ కథను వినిపించాడని… దానిని అతను ఓకే అని అన్నాడని తెలిసింది. గతంలో మణిరత్నం చిత్రం ‘ఓకే బంగారం’ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో నాని డబ్బింగ్ కూడా చెప్పాడు. ఆ సమయంలో ఎప్పటికైనా మణిరత్నం సినిమాలో హీరోగా చేయాలని కోరుకుంటున్నట్లు నాని తెలిపాడు. ఇప్పుడు అతని కోరిక నెరవేరబోతోందట. ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ పూర్తయిన వెంటనే మణిరత్నం ఈ సినిమాను మొదలుపెడతాడట.  బహుశా వచ్చే ఏడాది చివరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

Comments

comments