Search
Saturday 22 September 2018
  • :
  • :

దర్శకుడు మణిరత్నానికి గుండెపోటు

Chennai : Director Mani Ratnam Suffers From Heart attack

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి గురువారం గుండెపోటు వచ్చింది. తక్షణమే ఆయన్ను చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ‘ చెక్క చివంత వనం’ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బొంబయి, రోజా, దళపతి, నాయకుడు, చెలియా, ఒకే బంగారం, గురు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను తన సినిమాలతో ఆయన అలరించారు.

Director Mani Ratnam Suffers From Heart attack

Comments

comments