Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జాతీయ అవార్డుల మురుగదాస్ విమర్శలు

AR-Murugadoss

జాతీయ అవార్డుల్ని ప్రకటించినప్పుడల్లా కొందరు హర్షం ప్రకటించడం… మరికొందరు అసంతృప్తి వ్యక్తంచే యడం మామూలే. అవార్డులు ఆశించి నిరాశకు గురైన వాళ్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతుంటారు. అయితే అవార్డులేమీ ఆశించకుండానే ఓ ప్రముఖ దర్శకుడు అవార్డుల తీరుపై విమర్శలు వ్యక్తంచేయడం చర్చనీయాంశం అవుతోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు… మురుగదాస్. మహేష్‌బాబుతో ప్రస్తుతం సినిమా తీస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ జాతీయ అవార్డుల జ్యూరీపై విమర్శలు గుప్పించాడు. అవార్డుల ఎంపికలో పక్షపాతంతో వ్యవహరించారని ట్వీట్ చేశాడు. జ్యూరీలో ఉన్నవాళ్ల ప్రభావం, పక్షపాతం అవార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోందని… ఇవి ఏక పక్షంగా ఇచ్చిన అవార్డులని మురుగదాస్ తేల్చేశాడు.

ఇక మురుగదాస్ టార్గెట్ అంతా జ్యూరీకి నేతృత్వం వహించిన ప్రియదర్శనే అని అంతా అంటున్నారు. ఆయన తనకు నచ్చిన హీరోలకు అవార్డులిచ్చుకున్నాడని ఇదివరకే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రియదర్శన్‌తో చాలా సినిమాలు చేసిన అక్షయ్‌కుమార్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కగా… ప్రియదర్శన్‌కు అత్యంత ఆప్తుడే కాకుండా ఆయనతో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన మోహన్‌లాల్‌కు ప్రత్యేక జ్యూరీ పురస్కారం దక్కింది. అంతేకాకుండా మలయాళ సినిమాలకు కూడా ఎక్కువ అవార్డులొచ్చాయి. దీనిపై బాలీవుడ్‌వాళ్లే విమర్శలు గుప్పిస్తుండగా… వారికి మురుగదాస్ తోడవడం విశేషం.

Comments

comments