Search
Saturday 17 November 2018
  • :
  • :

మెగాస్టార్.. మెగా ఫెంటాస్టిక్ : ఆర్‌జివి

Ram-Gopal-Varmaతన ట్వీట్లతో తరుచూ వివాదాలు సృష్టించడం దర్శకుడు రాం గోపాల్ వర్మకు అలవాటే. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్.150’ ప్రీ రిలీజ్ వేడుకలో రాం గోపాల్ వర్మపై మెగాస్టార్ తమ్ముడు నాగబాబు పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దీని స్పందిస్తూ… రాం గోపాల్ వర్మ నాగబాబుపై తనదైన శైలీలో ట్వీట్లు చేస్తూ విమర్శించిన విషయం తెలిసిందే. కాగా చిరు 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణీ రెండు చిత్రాలు ఒక రోజు తేడాతో విడుదలై విజయం సాధించాయి. కానీ ఈ రెండు చిత్రాల్లో వర్మ శాతకర్ణీపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ ట్వీట్లు చేశాడు. అద్దెకు తెచ్చిన కథ కంటే శాతకర్ణీ 150 సార్లు అద్భుతంగా ఉందంటూ పలు ట్వీట్లు చేశాడు. చిరు సినిమాతో తెలుగు సినిమా 10ఏళ్లు వెనక్కి పోతే శాతకర్ణీ 2వేల సంవత్సరాల కథతో తెలుగు సినిమాని 10ఏళ్లు ముందుకు తీసుకెళ్లిందటూ పేర్కొన్నాడు.
ఇంతలో ఏమైందో.. ఏమో మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తూ వర్మ ట్వీట్టర్‌లో రెండు ట్వీట్లు చేశాడు. ‘ఇప్పుడే ఖైదీ నంబర్.150 చేశాను. మెగాస్టార్.. మెగా.. మెగా.. మెగా ఫెంటాస్టిక్‌గా ఉన్నారు. ఆయనకు 150 మిలియన్ల ఛీర్స్’ అంటూ ఒక ట్వీట్, ‘మెగాస్టార్ ఎనర్జీ అద్భుతంగా ఉంది. ఆయన సినిమాలు మానేసిన 9 సంవత్సరాల క్రితంకంటే ఇప్పుడే యవ్వనంగా కనిపిస్తున్నారు. ఆయన మెగా హ్యాండ్‌సమ్‌గా ఉన్నారంటూ వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇదంతా చూసిన నెటిజన్లు మాత్రం గందరగోళ స్థితిలో పడిపోయారు. 6 రోజుల క్రితం మెగాస్టార్‌ని విమర్శిస్తూ ట్వీట్ చేసిన వర్మ.. సడన్ ఆయన్ని ఇంతలా పొడుగుతూ ట్వీట్ చేయడం ఏంటి అనే ఆలోచిస్తున్నారు. కానీ మరోసారి రాం గోపాల్ వర్మ తాను ఎవ్వరికి అర్థం కాని వ్యక్తినని నిరూపించుకున్నాడు.

Comments

comments