తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజామౌళికి ఓ ప్రత్యేక శైలి ఉంది. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ విజయాన్ని నమోదు చేయడమే దీనికి నిదర్శనం. తాజాగా తీసిన ‘బాహుబలి’ మూవీ జక్కన్నను ఏకంగా జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాంటి ఘనపాటికి టాలీవుడ్లో బడా నిర్మాతగా పేరొందిన గీతా ఆర్ట్ అధినేత అల్లు అరవింద్ మధ్య కోల్డ్‌వార్ జరిగినట్లు తెలుస్తోంది.
ఒకనొక సందర్భంలో జక్కన్నను కలిసిన అల్లు అరవింద్ మళ్ళీ మనం చరణ్‌తో ఓ సినిమా తీద్దామని చెప్పారట. దానికి జక్కన్న మీతో మళ్లీ సినిమా తీయడం కుదరదని మొహం మీదే చెప్పేశారట. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న అరవింద్ కారణమేమిటని దర్శకధీరుడిని అడిగారు. దీనికి సమాధానంగా ‘మగధీర’ మూవీ సమయంలో అంత కష్టపడిన నాకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోగా హీరో చరణ్‌కి ఎక్కువ క్రెడిట్ ఇచ్చారంటూ మండిపడ్డారట.
నా కష్టానికి గుర్తింపు లేని చోట నేను పనిచేయలేనని నిర్మొహమాటంగా చెప్పేశారట. ఇలాగే కొన్ని రోజుల క్రితం చరణ్ తో మళ్ళీ మగధీర లాంటి హిట్ కొడతారా? అన్న ప్రశ్నకి నా జీవితంలో మళ్ళీ ఆ హీరోతో సినిమా తీయను. కష్టానికి ప్రతిఫలం దక్కని చోట మనం ఎంత కష్టపడినా ఫలితం శూన్యం అని జక్కన్న తనలోని నిరాశను వ్యక్తం చేశారు.