Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అమ్మాయి అర్ధనగ్న ప్రదర్శనకు అందరం సిగ్గుపడాలి: తమ్మారెడ్డి

ప్రముఖ సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

ప్రముఖ సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

హైదరాబాద్: అమ్మాయి అర్ధనగ్న ప్రదర్శన చేసిందంటే మనమందరమూ సిగ్గుపడాల్సిన విషయమని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇటీవల నటి శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనను ‘మా’ అసోషియేషన్ తప్పుపట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మాట్లాడాల్సింది అమ్మాయి గురించి కాదు.. సమస్యల గురించి అని ఆయన స్సష్టం చేశారు. శ్రీరెడ్డితో కలిసి పనిచేయొద్దనే హక్కు ప్రజా స్వామ్యంలో ఎవరికీ ఉండదు, శ్రీరెడ్డికి ‘మా’ సభ్యత్వం ఇస్తారా లేదా అనేది వాళ్లిష్టంపై ఆధారపడివుంటుందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఫలానా వాళ్లతో పని చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పడం తగదన్నారు. ఏ ధైర్యంతో ‘మా’ ఆ మాట చెప్పిందో నాకు తెలీదని భరద్వాజ పేర్కొన్నారు.

Comments

comments