Home తాజా వార్తలు నాకు పొగరు…

నాకు పొగరు…

Director Tejaహైదరాబాద్  : తేజా … కెమెరామెన్ నుంచి దర్శకుడిగా అవతరించిన వ్యక్తి. ముక్కుసూటిగా వ్యవహరించే తేజపై అనేక మంది పలు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు సైతం వినూత్నంగా ఉంటాయి. కొత్త వారిని ప్రోత్సహించడంలో తేజా ముందుంటారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సీత’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలో తేజా మాట్లాడారు. తనకు పొగరు ఎక్కువని పరిశ్రమంలో టాక్ ఉందని ఆయన పేర్కొన్నారు. నన్ను తమ వైపు తిప్పుకొలేని కొందరు తేజాకు పొగరు అంటూ చెడు ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. తాను అనుకున్న మార్గంలోనే వెళుతానని, ఇది పొగరు అనుకంటే , అది తనలో ఇప్పటికీ ఆలాగే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాను సినిమా ఫంక్షన్లకు వెళ్లనని, దీనికి ఓ కారణం ఉందని ఆయన చెప్పారు. ఫంక్షన్లకు వెళితే ఇష్టం లేకపోయినా, నవ్వాలని, వాళ్లను, వీళ్లను పొగడాలని, మనస్సులో అభిమానం లేకపోయినా, కృత్రిమ నవ్వుతో కౌగిలించుకోవాల్సి ఉంటుందని, ఇలాంటివి తనకు నచ్చని తేజా పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే తనకు వచ్చని, ఇది చాలా మందికి నచ్చక తనకు పొగరు అని చెబుతుంటారని, వారి మాటలను తాను పట్టించుకోనని తేజా స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు సాగుతానని ఆయన తేల్చి చెప్పారు.

Director Teja Comments On Tollywood Film Industry