Home తాజా వార్తలు శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్

శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్

Director Trivikramతిరుమల:  తిరుమల శ్రీవారిని  ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వసంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు. అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను త్రివిక్రమ్ కు అందించారు.

Director Trivikram Visits Tirumala Temple