Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గౌడ సంక్షేమానికి కృషి

మొగల్ సామ్రాజ్యాన్ని దిక్కరించిన వీరుడు సర్ధార్ పాపన్న గౌడ్
గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి
కడెంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ
తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్

SWAMY

మన తెలంగాణ/ఖానాపూర్: మొగల్ సామ్రాజ్యాన్ని దిక్కరించి బడుగుల సంక్షేమం కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కే దక్కుతుందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వాఖ్యానించారు. ఆదివారం కడెం మండల కేంద్రంలో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణను శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మంత్రి జోగురామన్న ఎంఎల్‌ఎ రేఖానాయక్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. తెలంగాణలో రాచరిక వ్యవస్థ విధానానికి వ్యతిరే కంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమ్ర య్య, చాకలి ఐలమ్మ, కొంరంభీం ఆశయాలను కొనసాగిం చాలని పేర్కొన్నారు. సీమాంద్రల నాయకుల కుట్రల వల్లే వీరి చరిత్ర చరిత్ర పుటల్లోచే దాగి ఉందని పేర్కొన్నారు. గౌడ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అటవీ శాఖ మంత్రి రామన్న మాట్లాడుతూ రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి బడుగులకు విముక్తి కల్పించడంతోనే బలహీన వర్గాల ప్రజలు నాయకులుగా చట్టసభల్లోకి ప్రవేశించారని అలాంటి వీరులను నిత్యం స్మరించుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్య క్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణ్‌గౌడ్, నర్సాగౌడ్, శేషగిరిగౌడ్, నాగరాజుగౌడ్, ప్రభా కర్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, గాజుల ముకేష్‌గౌడ్, కడెం ఎంపిపి బుక్కె అమ్మి, తహసిల్దార్ నర్సయ్య, ఎంపిడివో విలాస్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ చిట్యాల చిన్నయ్య, ఎంపిటిసి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సక్కారం శ్రీనివాస్, ఖానాపూర్ పిఎసియస్ అద్యక్షులు వెంకాగౌడ్, గౌడ సంఘం మండల అద్యక్ష కార్యదర్శులు ఇల్లాకరం కమలాకరం గౌడ్, బొర్రరవిగౌడ్, మామిడిపెల్లి రాజేశ్వ ర్‌గౌడ్, బొమ్మ దశీగౌడ్, సురేష్‌గౌడ్, శేఖర్‌గౌడ్, తదితరులున్నారు.

Comments

comments