Home ఆఫ్ బీట్ విజయ్‌తో సినిమా చేయాలనుంది..!

విజయ్‌తో సినిమా చేయాలనుంది..!

Discussion in Social Media about Movie Vijay, Janhvi

విజయ్‌దేవరకొండ హవా బాలీవుడ్‌కూ పాకింది. ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల అర్జున్ కపూర్, జాన్వీ కాఫీ విత్ కరణ్ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు. షోలో రాపిడ్ ఫైర్‌లో భాగంగా కరణ్ జోహార్.. జాన్విని ఓ ప్రశ్న అడిగాడు. ఒక రోజు ఉదయం నిద్రలేవగానే పురుషుడిగా మారిపోవాలంటే ఏ నటుడ్ని ఎంచుకుంటావు అని అడిగాడు. దీనికి జాన్వీ కపూర్ తడుముకోకుండా.. విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాదు తనతో సినిమా చేయాలనే కోరికని కూడా బయట పెట్టింది. జాన్వీ సమాధానం విన్న తరువాత కరణ్,  విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాడు.

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ గా మారాడన్నాడు. ఆ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశాడు . విజయ్ దేవరకొండ సెక్సీ సౌత్ ఇండియన్ స్టార్ అంటూ కరణ్ జోహార్ కితాబిచ్చేశాడు. ఈ షోతో జాన్వీ కపూర్, విజయ్ దేవరకొండ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.  ఇప్పుడు జాన్వీ కపూర్, కరణ్ జోహార్ ఈ సంచలన టాలీవుడ్ హీరోని ప్రశంసించడం చూస్తుంటే.. వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందా అనే వార్తలు వస్తున్నాయి. తాను బాలీవుడ్‌లో నటించడానికి కూడా సిద్ధం అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Discussion in Social Media about Movie Vijay, Janhvi

Telanagna Latest News