Home తాజా వార్తలు ప్లీనరీలో అన్ని అంశాలపై చర్చ : ఈటల

ప్లీనరీలో అన్ని అంశాలపై చర్చ : ఈటల

Discussion on All Topics in the TRS Plenary : Etela

మేడ్చల్ : ఈనెల 27న కొంపల్లిలో జరిగే టిఆర్‌ఎస్ ప్లీనరీలో తెలంగాణ సిఎం కెసిఆర్ అన్ని అంశాలపై చర్చిస్తారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన ప్లీనరీ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణోద్యమంలో ఎన్నో అవమానాలు భరించామని, చివరికి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని ఆయన చెప్పారు. కెసిఆర్ దీక్షా దక్షతలను గుర్తించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారని ఈటల పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పాలన చేసిన పార్టీల కంటే తెలంగాణలో టిఆర్‌ఎస్ పాలనే బాగుందన్నారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా తెలంగాణకు దేశంలో పేరుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన టిఆర్‌ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

Discussion on All Topics in the TRS Plenary : Etela