Search
Friday 16 November 2018
  • :
  • :

జిఎస్‌టిపై పోరే

వచ్చే కౌన్సిల్ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావన
నడుస్తున్న ప్రాజెక్టులపై పన్నును అప్పటికీ తగ్గించకపోతే హైకోర్టును ఆశ్రయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

GST

హైదరాబాద్ : రాష్ట్ర ప్రాజెక్టులపై జిఎస్‌టిని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేం ద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 24వ తేదీన నిర్వహించే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తనున్నారు. అయినప్పటికీ మన్నించకపోతే న్యా యం కోసం హైకోర్టును ఆశ్రయించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 12 శాతం జిఎస్‌టి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.12వేల కోట్లు సమకూరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల భారం పడుతున్న ట్లు అంచనా. 12 శాతం జిఎస్‌టి రాబడిలో సగం కేంద్రానికి, సగం రాష్ట్రానికి విభజిస్తారు. ఆ ప్రాతిపదికన రాష్ట్రానికి రూ.6వేల దాకా నష్టం వస్తుందని ఒక అధికారి వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ వాద న సరికాదని, తగ్గించడం వల్ల రాష్ట్రానికి నష్టం రాదని అంటున్నారు. తొలుత ప్రాజెక్టులపై 18 శాతం విధించగా, తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడంతో పాటు గతంలో మాదిరే 5 శాతం విధించాలని విజ్ఞప్తి చేసిం ది. జిఎస్‌టి అమలుకు ముందు ప్రాజెక్టు పనులపై 5 శాతం వ్యాట్ విధించే వారు. అమాంతంగా పెంచడం మూలంగా తెలంగాణలో మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుందని, సుమారు రూ.18వేల కోట్ల అదనపు భారం పడుతుందని లెక్కలతో సహా వివరించారు. ఈ అంశంపై సమీక్షించిన అనంతరం 18 నుంచి 12 శాతానికి తగ్గించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచుతునే ఉంది. దీన్ని కూడా 5 శాతానికి తగ్గించాలని శనివారం హైదరాబాద్‌లో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో మరోసారి డిమాండ్ చేశారు. తెలంగాణ తో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, మరో 4 రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులపై జిఎస్‌టి భారాన్ని తగ్గించాలని గట్టిగా కోరుతున్నాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షం నిర్ణయించుకున్నది. ఇందులో మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. గతంలో తాగునీటి పైపులు, నీటి మోటార్లపై సెంట్రల్ ఎక్సైజ్ మినహాయింపు ఉంది. రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరదు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇవి చేపడుతున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదిస్తున్నది. తాజాగా వీటిని జిఎస్‌టి పరిధిలోకి తెచ్చారు. రెండు సంవత్సరాల వ్యవధిలో రూ.1 లక్షల పనులు పూర్తయితేనే రూ. 12వేల కోట్ల భారం పడుతుందని అంటున్నారు. ఈ మొత్తం నుంచి రూ.6వేల కోట్లు కేంద్రం నుం చి తిరిగి రా్రష్ట్రానికి వస్తాయి. అంటే సాలీనా రాష్ట్రంపై రూ.3 వేల వరకు అదనపు భారం ఉంటుందనే స్పష్టమవుతుంది. ఒకవేళ ప్రాజెక్టులు మూడేళ్ల వరకు కొనసాగితే ఏడాదికి రూ.2వేల కోట్ల వరకు భారం ఉంటుందని అధికారుల అంచనా.

Comments

comments