Home జాతీయ వార్తలు అవిశ్వాసంపై శుక్రవారం చర్చ

అవిశ్వాసంపై శుక్రవారం చర్చ

Discussion on infidelity on Friday in Lok Sabha

ఢిల్లీ : కేంద్రంపై టిడిపి సహా పలు పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈమేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టనున్నట్టు స్పీకర్ తెలిపారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్రారంభమైన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో టిడిపి సహా పలు విపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి సహా పలు విపక్ష పార్టీలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానాలపై శుక్రవారం నాడు చర్చ చేపడుతామని స్పీకర్ మహాజన్ ప్రకటించారు.

Discussion on infidelity on Friday in Lok Sabha