Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గుప్పెడు నట్స్‌తో రోగాలకు చెక్

Nutsబాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, పల్లీలు, ఎండు ద్రాక్ష, అంజీర్, అక్రోట్, పిస్తాల్లాంటి నట్స్‌ను రోజూ గుప్పెడు తినడం వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు అంతర్జాతీయ పరిశోధకులు. తాజాగా వీరు ఎనిమిది వేల మందిపై చేసిన పరిశోధనలో నట్స్ తిన్నవారంతా ఎటువంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. గుండె జబ్బులతోపాటు క్యాన్సర్, మధుమేహంలాంటి రోగాలు రాకుండా నట్స్ కాపాడతాయంటున్నారు.  అధిక శాతం కొవ్వు, పీచు పదార్థం కలిగి ఉండటం వల్ల గుండెకు బలాన్నిస్తాయి. ఫైబర్, పోషకపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వు కలిగి ఉండటం వల్ల ఇబ్బంది లేదు. ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటంవల్ల కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. తాజాగా రోజూ ఇరవై గ్రాముల నట్స్ తీసుకుంటే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయని కనుగొన్నారు.

Comments

comments