Home జాతీయ వార్తలు ములాయం.. భీష్ముడిలా ఉండకండి…. అక్కడ ద్రౌపదీ వస్త్రాపహరణం

ములాయం.. భీష్ముడిలా ఉండకండి…. అక్కడ ద్రౌపదీ వస్త్రాపహరణం

Sushma Swaraj

 

లక్నో: ఎస్పీ నేత అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తప్పుపట్టారు. సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ పెద్ద నేత అని… మీకు దగ్గరలో రామ్ పూర్‌లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుందని, భీష్ముడి మాదిరిగా మౌనంగా ఉండకండన్నారు. భీష్ముడి మాదిరి మౌనం వహించి పొరపాటు చేయవద్దని ములాయంకు సూచించారు. అజంఖాన్ జయప్రదంపై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో సుష్మా షేర్ చేశారు. జయప్రద నిజ స్వరూపం తెలుసుకునేందుకు రామ్ పూర్ ప్రజలకు 17 ఏండ్లు పట్టిందని, తాను మాత్రం 17 రోజుల్లోనే ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుందని హేళన చేసిన అజంఖాన్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా యుపి పోలీసులు అజంఖాన్ పై కేసు నమోదు చేశారు. సమాజ్ వాదీ పార్టీ తరుఫున రామ్ పూర్ నుంచి జయప్రద రెండు సార్లు లోక్ సభకు (2004, 2009) ఎన్నికయ్యారు. ఫిబ్రవరిలో ఆమె బిజెపిలో చేరారు. 1994లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ పిలుపు మేరకు టిడిపిలో చేరారు. ఎన్టీఆర్ చనిపోయిన తరువాత ఆమెకు సిఎం చంద్రబాబు నాయుడుతో విభేదాలు రావడంతో సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ములాయం సింగ్ యాదవ్, జయప్రదకు సమాజ్ వాదీ పార్టీలో రాజకీయంగా విభేదాలు ఉండడంతో ఆ పార్టీని వదిలి బిజెపిలో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఎస్పీ నుంచి అజంఖాన్, బిజెపి తరుఫున జయప్రద బరిలోకి దిగారు.

 

Disrobing of the Draupadi of Rampur: Sushma Swaraj