Home తాజా వార్తలు దేశమంతా అసంతృప్తి: రాహుల్ గాంధీ

దేశమంతా అసంతృప్తి: రాహుల్ గాంధీ

Congress1

హైదరాబాద్: ప్రస్తుతం దేశమంతా అసంతృప్తి, ఆగ్రహం ఉందని ఎఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలిపారు. 84వ ఎఐసిసి ప్లీనరీ సమావేశంలో రాహుల్ ప్రసంగిస్తూ…. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ ప్లీనరీ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శనం చేసే విధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని సూచించారు. పార్టీలోని అనుభవజ్ఞులు యువతకు మార్గనిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. యువతను నిరుద్యోగం వెంటాడుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశం ప్రజలందరిది, అన్ని మతాలు, వర్గాలదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మార్గదర్శిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు.