Search
Sunday 18 November 2018
  • :
  • :

అపసవ్యం

LOVE

చినుకు చిందని మబ్బు సోయగం
ఎన్నీల కాయని ఆకాశ వైశాల్యం
బారులు తీరని వెలుతురు కిరణాల తూరుపు కొండ
వృధానే …
వ్యధ మిగులునె…
వసంతగీత మొలకని పక్షి స్వేచ్ఛాగాన మాధుర్యం
గగనవిహారం చేయని కొంగలబారు ఐక్యత్వం
దవన పరిమళం వెదజల్లని పూలకారు ఋతుధర్మం
ఉనికేలనో…
మనకేలనో…

తుమ్మెదల ఝంకార వలయాకృతాల్లేని పూదోట ఆకర్షణ
చెట్టు కొమ్మన ఊయలూగని పిచ్చుకల, కిచకిచల సందళ్ళు
విడిచిన బాణం లా సాగే చీమలబారు దృక్పథం
ఆశ్చర్యార్థకాలే..
ప్రశ్నార్థకాలే..
మూలమలుపులో ఎదురుపడే గాయం
చాచిన చేతిలోవాలే రేపటి చీకటి
వెన్నంటి వస్తూ, వేటాడుతూ, తలచుట్టూ
తిరుగుతున్న దుశ్చింతల కల
ఎప్పటి దాకానా…
ఒప్పని దాకానా…

Comments

comments