Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సబ్సిడీపై పెరటికోళ్ళు పంపిణీ

kodi

మన తెలంగాణ/నిర్మల్ : దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు పూర్తిస్థాయి సబ్సిడీ పై పెరటి కోళ్ళను సరాఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యం.ప్రశాంతి తెలిపారు.సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా పశుసంవర్థక శాఖ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పెరటీ కోళ్ళను కలెక్టర్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి రూ.4650 విలువ గల 45 పిల్లలను పూర్తిస్థాయి రాయితీపై అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.జిల్లాలో మొదటి విడత క్రింద మూడు వందల కుటుంబాలకు ఈ పథకం క్రింద పెరట కోళ్ళను పంపకం పై ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి గజ్జారం జిల్లా రెవెన్యూ అధికారి రమేష్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments