Home పెద్దపల్లి ఒడిశా కార్మికులకు దుప్పట్లు పంపిణీ

ఒడిశా కార్మికులకు దుప్పట్లు పంపిణీ

odisha

మనతెలంగాణ/పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని సుబాష్ నర్సిం గ్ హోంలో సుధరావు డా.వెంకటేశ్వరరావు దంపతులు తన మనుమ రాలు దోహిత రావు పుట్టిన రోజు సందర్భంగా ఒడిశా కార్మికులకు బు ధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కూమారుడు అభినవ్-మధుబాల కూతురు దోహిత మొదటి పుట్టిన రోజు సందర్భంగా 100 మంది కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశామని తెలిపారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరు బయట ఇటుక బట్టిల వద్ద ఉండే కార్మికు లను గుర్తించి వారికి పంపిణీ చేశామన్నారు. ప్రజా శ్రేయస్సుకు ఈ కా ర్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.