Search
Monday 24 September 2018
  • :
  • :

ఆగస్ట్ మొదటి వారంలో పాడిగేదెల పంపిణీ

talasani

హైదరాబాద్ : పాడిగేదెల పంపిణీ కార్యక్రమంపై అన్ని జిల్లాల పశు వైద్యాధికారులతో సచివాలయంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్ట్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పాడిగేదెల పంపిణీ కార్యక్రమం చేపడతామని తలసాని వెల్లడించారు. కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీ, విజయ డెయిరీలలో సభ్యులుగా ఉన్న సుమారు 2 లక్షల 13 వేల మంది పాడి రైతులకు ఈ పథకంతో లబ్ధి కలుగుతుందని తెలిపారు. ఈ పథకం అమలులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లబ్ధిదారులు, పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. లబ్ధిదారులు నచ్చిన ప్రాంతంలో వారు ఎంపిక చేసుకున్న నాణ్యమైన పాడి గేదెలు, ఆవులను కొనుగోలు చేసేలా విధి విధానాలను రూపొందించామని మంత్రి చెప్పారు. పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారిని ప్రోత్సహించేందుకు సబ్సిడీపై పాడి గేదెలు, ఆవులు పంపిణీ చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, పాడి పశువుల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను  మంత్రి తలసాని  ఆదేశించారు.

Comments

comments