Home భద్రాద్రి కొత్తగూడెం నిత్యావసర సరుకుల పంపిణీ బాధ్యత మీదే!

నిత్యావసర సరుకుల పంపిణీ బాధ్యత మీదే!

Distribution of essential commodities is yours!

వచ్చే నెల ఒకటో తేది నుండి రేషన్ సరుకుల సరఫరాకు సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టి నేటికి కూడా కొందరు డీడీ చెల్లింపులు చేయలేదు. డీడీలు కట్టని రేషన్ డీలర్లపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. తప్పని సరి పరిస్థితుల్లో రేషన్ సరుకుల సరఫరా బాధ్యత ఏజెన్సీ ప్రాంతాల్లో జిసిసి, మహిళా సంఘాలకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సంఘాలకు అప్పగించనున్నారు. నిర్ణీత సమయానికి రేషన్ సరుకులకు డీడీలు చెల్లింపులు కాకుంటే జూలై నెల చౌకదుకాణాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : వచ్చే నెల ఒకటవ తేది నుండి రేషన్ సరుకులు సరఫరాకు సర్కారు ప్రత్యామ్నా య మార్గాలను ఎంచుకుంది. రేషన్ డీ లర్లు సమ్మె బాట ప ట్టి నేటికి కూడా కొందరు డిడి చెల్లింపు లు చేయలేదు. డిడి లు కట్టని రేషన్ డీలర్లపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. తప్పని సరీ పరిస్థితుల్లో రేషన్ సరుకుల సరఫరా భాద్యత ఏ జెన్సీ ప్రాంతాల్లో జిసిసి, మహిళా సంఘాలకు, పట్టణ ప్రా ంతాల్లో మెప్మా సంఘాలకు అప్పగించనున్నారు. నిర్ణీత స మయానికి రేషన్ సరుకులకు డిడి లు చె ల్లింపులు కాకుంటే జూలై నెల చౌకదుకాణాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
రేషన్ డీలర్లు జూలై 1వ తేది నుండి సెమ్మెకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జూలై మాసానికి చెందిన రేషన్ సరుకులకు డిడి చెల్లింపులు చేయలేదు. దీంతో జూలై మాసంలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ప్రభుత్వం అందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓ కసరత్తును ఇప్పటికే పూర్తి చేసింది. రేషన్ డీలర్లు డిడిలు చెల్లించి పంపిణీకి ముందుకు రాని సందర్భంలో గిరిజన సహకారం సంస్థ, మహిళా సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యవసర సరుకులు అందించేందుకు జిల్లా యం త్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలో మొత్తం 442 రేషన్ షాపులకు గానూ 2 లక్షల 75 వేల రేషన్ కార్డులు ఉన్నా యి. వీటికి గాను మొత్తం 52 వేల మెట్రిక్‌టన్నుల బియ్యా న్ని అందించాలి, అందేవిధంగా ప్రతీ కార్డుకు ఒక లీటర్ చొ ప్పున కిరోసిన్ ఇవ్వాలి. గురువారం నాటికి డీలర్లు డిడిలు చెల్లింపులు చేసి సరకులు తీసుకోవాల్సి ఉంది. కానీ గురువారం కడపటి వార్తలు అందే సమయానికి సుమారు 200 మంది మాత్రమే డిడిలు చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది.

నోటీసులు :- నిత్యవసర సరుకులను రేషన్ డీలర్లు తీసుకునేందుకు డిడిలు గురువారం నాటికి చెల్లించాల్సి ఉంది. అ లా చెల్లింపులు చేయని డీలర్లకు శుక్రవారం నాడు ప్రభు త్వం నోటీసులు జారీ చేయనుంది. అప్పటికే జిల్లా అధికార యంత్రాంగం నోటీసులు సిద్ధం చేసి పెట్టుకుంది. అదే విధ ంగా వారిని సస్పెషన్ చేసి వేటు వేసే అవకాశం ఉన్నట్లు జి ల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

మహిళా సంఘాలకు ఉద్దెరగా సరుకులు :- డీలర్లు మొం డికేసి నేపథ్యంలో ప్రభుత్వం సరకురుల సరఫరాకు ఎంచుకున్నవారికి ఎలాంటి రుసుము లేకుండా ఉద్దెరగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. సరకుల సరఫరా తర్వాత రేషన్ డీ లర్లకు ఇచ్చే కమీషన్ ఏదైతో ఉందో ఆ కమీషన్ మొత్తం చౌ కదుకాణాన్ని నిర్వహించే వారికి చెల్లింపులు చేయనున్నా రు. దీంతో ఆయా మహిళా సంఘాలు, జిసిసి కూడా ముం దుకు వస్తోంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఆదాయం స మకూరనుండటంతో నిర్వహణ చేసేందుకు తామంటే తా ము అంటూ ఇప్పటికే అధికారులకు వారు తమ పేర్లను ఇ చ్చుకున్నట్లు తెలుస్తోంది.

పర్యవేక్షణ వీరిదే : ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా నిత్యవసరకులు లబ్ధిదారులకు అందించడంలో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చ ర్యలు తీసుకుంటుంది. నిత్యవసర సరుకులను అందించే డి స్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్ద తహశిల్దార్లను, పంపిణీ కేంద్రా ల వద్ద విఆర్వోలు, విఆర్‌ఏలను పర్యవేక్షణ చేయాలని ఇ ప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్‌డిఓలు ఆదేశించించారు. ఒక్కో రే షన్ షాపు వద్ద మహిళా సంఘాల ప్రతినిధులతో పాటు ఇద్ద రు సహాయకులను నియమించుకునే వెసులుబాటును జిల్లా యంత్రాంగం కల్పిస్తోంది.

దారికొచ్చే పనిలో డీలర్లు : తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు సమ్మె బాటపట్టినప్పటికీ ప్రభుత్వం తీ సుకోబోతున్న కఠిన నిర్ణయానికి జంకుతున్నట్లు తెలుస్తోం ది. గురువారం సాయంత్రం వరకు కనీసం 100 మంది డీ లర్లు కూడా డిడిలు చెల్లింపుల చేయలేదు. కానీ ఆ తర్వా ఆ న్‌లైన్ ద్వారా డిడి చెల్లింపులు వేగం పుంజుకుంది. ప్రజాపంపిణీ వ్యవస్థకు విఘాతం కలిగిస్తే ప్రజల నుండి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం ప్ర త్యామ్నాయ ఏర్పాట్లకు పూనుకోవడంతో చేసేది లేక గతం లో మాదిరిగానే సరుకులు కోసం డిడి చెల్లింపులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గడువు ముగిసిపోయినప్పటికీ ఒక్క రోజు వెసులుబాటు కల్పించాలని అధికారులను రేషన్ డీల ర్లు కోరినట్లు పుకార్లు వస్తున్నాయి.