Home నాగర్ కర్నూల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకారం అందించాలి

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకారం అందించాలి

Collector-Sridhar-image,District collector Sridhar wants political parties to cooperate

మన తెలంగాణ / నాగర్ కర్నూల్: ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీలకు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన వీవీ పాట్ విధానాన్ని వివరించారు. సీల్ వేసే పద్ధతి, బ్యాలెట్ విధానం, తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈనెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదు చేయించాలని ఆదేశించారు. విడతల వారిగా సమావేశాలు నిర్వహించి ప్రతి అంశంపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెసి శ్రీనువాస్ రెడ్డి, డిఆర్‌ఓ మదుసూదన్ నాయక్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.