Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జిల్లా ఆస్పత్రికి డబ్బు జబ్బు

వైద్యుల నిర్వాకానికి
పిట్టల్లా రాలుతున్న రోగులు
14 మందికి నలుగురే వైద్యులు
పేదలకు అందని సర్కారీ వైద్యం
సమీక్షలు నిర్వహించని  మంత్రి మహేందర్‌రెడ్డి

OLD

మన తెలంగాణ/తాండూరు : జిల్లా ఆస్పత్రికి డబ్బుజబ్బు పట్టుకుంది. వైద్యం కోసం వస్తున్న రోగులను ఇక్కడి వైద్యులు పీడిస్తున్నారు. దీంతో జిల్లా ఆస్పత్రికి వస్తున్న రోగులు పిట్టల్లా రాలుతున్నారు. దీనిపై గతంలో జిల్లా ఆస్పత్రి సలహా సంఘం సమావేశంలో సభ్యులు మంత్రి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన  ఆస్పత్రి తీరు మారడం లేదు.

ఆస్పత్రి పనితీరు ఇక్కడి వైధ్యుల ఖాళీలపై పలుమార్లు మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్షలు నిర్వహిస్తామని చెప్పిన ఇంత వరకు సమీక్షలు నిర్వహించ లేదు.దీంతో జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న వైధ్యులు రోగులను పట్టి పీడిస్తున్నారు.ప్రభుత్వ ఆస్పత్రిలో వైధ్యం కార్పోరేట్ ఆస్పత్రులను దాటిపోతుంది.తాండూరు జిల్లా ఆస్పత్రిలో 14 మంది వైధ్యులు పనిచేయాల్సి ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.అంతా కాంట్రాక్ట్ వైధ్యులే దీంతో రోగులు వద్ద అందినంత దండుకుంటున్నారు.డబ్బులు చెల్లించలేని రోగులు మృతి చెందుతున్నారు.మంత్రి ఇలాఖాలో ఇంత దారుణం జరుగుతున్న మంత్రి మాత్రం స్పందించడం లేదు.జిల్లా ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను భర్తి చేస్తామని హామీలు ఇస్తున్న మంత్రి ఆస్పత్రిపై శ్రద్ద చూపడం లేదు.
రాష్ట్ర సరిహద్దులో ఉన్న తాండూరు పట్టణంలో పేద ప్రజలకు ఖరీదైన వైధ్య సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో 2008లో అప్పటి ప్రభుత్వం తాండూరు పట్టణంలో రూ.7 కోట్లతో 200 పడకల ఆస్పత్రిని నిర్మించింది.మొదట్లో ఇక్కడ రోగులకు ఖరీదైన వైధ్య సేవలు అందించారు.అయితె జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న వైధ్యులు ఇక్కడి రోగుల సంఖ్యను బట్టి తాండూరు పట్టణంలో ప్రయివేటు నర్సింగ్ హోంలను ప్రారంభించారు.దీంతో వైధ్యులు ఇక్కడికి వస్తున్న రోగులను భయపెట్టి తాము నిర్వహిస్తున్న నర్సింగ్‌హోంలకు తరలిస్తున్నారు.దీనిపై అప్పట్లో పట్టణ వాసుల ఫిర్యాదు మేరకు అప్పటి కలెక్టర్ స్పందించి విచారణ నిర్వహించారు.

ఈ విచారణలో ప్రతి రోజు ఇక్కడికి వస్తున్న రోగులు జిల్లా ఆస్పత్రిలో వైధ్య సేవలు అందిస్తున్న నర్సింగ్ హోంలకు తరలిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది.అయితె ఆప్పట్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విచారణ ముందుకు సాగలేదు.ఇదే తంతుగా పెట్టుకున్న వైధ్యులు జిల్లా ఆస్పత్రికి వస్తున్న రోగుల వద్ద డబ్బులు చెల్లిస్తేనే వైధ్య సేవలు అందిస్తున్నారు.డబ్బులు లేని వారు మృతి చెందుతున్నారు.గత నెల రోజుల క్రితం పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామానికి చెందిన వడ్డే హన్మంతు కడుపునొప్పి భరించ లేక జిల్లా ఆస్పత్రికి వస్తే వైధ్యులు సరైన వైధ్యం అందించక పోవడంతో ఆస్పత్రిలోని కిటికికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.తాజాగా యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన మూడు రోజుల పసికందు డబ్బులు ఇవ్వలేదని వైధ్యులు చికిత్స చేయక పోవడంతో మృతి చెందింది,గతంలో కోడంగల్ మండలానికి చెందిన లలిత,పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి గొరమ్మ ప్రసవంలోనే పురిటి బిడ్డలను పొగొట్టుకున్నారు.ఇంతా జరుగుతున్న జిల్లా వైధ్యాది కారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో అక్కడ పనిచేస్తున్న వైధ్యులు రెచ్చిపోతున్నారు.ఆస్పత్రికి వస్తున్న రోగుల వద్ద డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న తాండూరు పట్టణంలో ఇంతా జరుగుతున్న మంత్రి స్పందించక పోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి.కొత్తగా భాద్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ దివ్వ సైతం జిల్లా ఆస్పత్రిని సందర్శించి రోగులకు మెరుగైన వైధ్యం అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.అయితె ఆస్పత్రి వైధ్యుల తీరుపై ప్రబావం చూపడం లేదు,మంత్రి మహేందర్‌రెడ్డి,జిల్లా కలెక్టర్ దివ్వ ,జిల్లా వైధ్యాధికారులు స్పందించి జిల్లా ఆస్పత్రి వైధ్యుల తీరుపై చర్యలు తీసుకోవాలని పేదలకు మెరుగైన వైధ్యం అందించాలని కోరుతున్నారు.

Comments

comments