Home జగిత్యాల ల్యాండ్ మాఫియాపై నజర్

ల్యాండ్ మాఫియాపై నజర్

కేవలం ఐదు రోజుల్లో 283 భూ వివాదాల ఫిర్యాదులు
భూ సెటిల్‌మెంట్లపై జిల్లా ఎస్‌పి సీరియస్

Police

జగిత్యాల: ల్యాండ్ మాఫియాపై జిల్లా పోలీస్ బాస్ దృష్టి సారించారు. రోజు రోజుకు భూ వివాదాలు పెరగడంతో పాటు, అమాయకులను బెదిరిస్తూ భూములు కాజేస్తున్న వారి ఆట కట్టించేం దుకు చర్యలు ప్రారంభించారు. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యం లో భూములపై ఎలాంటి హక్కు లేకున్నా దౌర్జన్యం చేసి భూములను ఆక్రమించుకోవడం… రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అమాయకుల ఆస్తులను కొల్లగొడితే సహించేది లేదని జిల్లా ఎస్‌పి అనంతశర్మ హెచ్చరిస్తున్నా రు. భూ వివాదాలకు సంబంధించి ఎస్‌పికి ఇప్పటికే వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కొం దరు రౌడీలు భూ వివాదాల్లో తలదూర్చి దౌర్జన్యం చేయడం… ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లు ఎస్‌పి దృష్టికి రావడంతో ఆయ న ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకు న్నారు. జగిత్యాల జిల్లాలో రియ ల్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కొంతమంది తప్పుడు పత్రాలతో విక్రయించి మోసాలకు గురి చేస్తున్నారు. ఒకే భూమిని పలువురికి విక్రయించి భూ వివాదాలకు తెర లేపు తు న్నారు.

పక్కనున్న భూములను ఆక్రమించుకుని హద్దులు చెరిపే యడం… ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేయడం కాదంటే భౌతికదాడులకు దిగడం పరిపాటిగా మారింది. ఇంకొందరేమో మరో అడుగు ముందుకేసి రెవెన్యూ సిబ్బంది సాయంతో రికార్డులను తారు మారు చేసి అక్రమంగా పట్టా చేసుకున్న సంఘటనలు న్నాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం తమ తాతలు, తండ్రులు కొనుగోలు చేసినా… పట్టా చేయించుకోక, రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పిడి చేయించుకోకుండానే సేద్యం చేసుకుంటుండగా రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిట ఉన్నందున ఆ భూమి మాదేనంటూ ఈ తరం వాళ్లు ఆ భూముల్లోకి రావడంతో గ్రామాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అయితే జిల్లాలో జరుగుతున్న అక్రమ భూ దందాల నేపథ్యంలో అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ బాస్ నడుం బిగించారు.

 ఇంత వరకు భూ సంబంధిత సమస్యలు సివిల్ మ్యాటర్‌గా పేర్కొంటూ పోలీసులు పెద్దగా పట్టించుకోకపోగా, జిల్లా ఎస్‌పిగా వచ్చిన అనంతశర్మ జిల్లాలో చోటు చేసుకుంటున్న భూ వివాదాలను పరిష్కరించాలని నిర్ణయించారు. భూ వివాదాలకు సంబంధించి ఈ నెల 7 నుంచి 12 వరకు ఎస్‌పి కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఎస్‌పి పేర్కొనడంతో కేవలం 5 రోజుల్లోనే పోలీస్ బాస్‌కు 283 భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందడాన్ని బట్టి చూస్తే భూ వివాదాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అవగతమవుతోంది. భూ వివాదాలపై అందిన ఫిర్యాదులను ఎస్‌పి క్షుణ్ణంగా పరిశీలి స్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 25 శాతం ఫిర్యాదులను పరిశీలిం చిన ఎస్‌పి వాటిని పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే కొంతమంది రౌడీషీటర్లు భూ వివాదాల్లో తలదూర్చుతున్నట్లు తెలుసుకున్న ఎస్‌పి జిల్లాలోని రౌడీషీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. భూముల సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు గురి చేసి భూములను కాజేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, పిడి యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

భూ వివాదాల్లో తలదూర్చితే సహించేది లేదు… జిల్లా ఎస్‌పి అనంతశర్మ

ఈ విషయ మై “మనతెలం గాణ”తో ఎస్‌పి మాట్లాడు తూ, భూ వివాదా ల్లో తలదూర్చితే ఎంత టి వారైనా సహించేది లేదన్నారు. జిల్లాలో నెల కొన్న భూ తగాదాలను పరిష్క రించే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 7 నుంచి 12 వరకు భూ తగాదాలకు సంబంధిం చిన ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. 283 ఫిర్యాదులు రాగా వాటిలో 65 ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి నాలుగింటిని వెంటనే పరిష్కరించామన్నారు.న్యాయస్థా నం పరిధిలో లేని భూ వివాదాలను రెవెన్యూ అధికారుల సాయంతో రికార్డులను పరిశీలించి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని, కొందరు రౌడీషీటర్లు భూ సెటిల్‌మెంట్లకు పాల్పడు తున్నట్లు తెలియడంతో వారిని పిలిపించి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు ఆయన వివరించారు.బెదిరింపులకు గురి చేసి బలవంతంగా భూములు లా క్కోవడం… ఆక్రమణలకు పాల్పడితే పిడి యాక్టు కేసులు నమోదు చేస్తామన్నారు. ల్యాండ్ మాఫియా పై ఉక్కుపాదం మోపి భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు ఎస్‌పి తెలిపారు. బలవంతంగా ఎవరైనా భూములు ఆక్రమించుకుంటే నేరుగా తనను వచ్చి కలవాలని, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్‌పి సూచించారు.