Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జిల్లా ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి కృషి

minister-mahender-reddyవిశ్రాంతి షెడ్ల నిర్మాణానికి నిధులిస్తా
సౌకర్యాల కల్పనకు పాటుపడతా
ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుదాం
రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలి
రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

తాండూరు టౌన్ : జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయిస్తానని, ఖాళీగా ఉన్న పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటానని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.శుక్రవారం జిల్లా ఆస్పత్రి అభివృద్ది సలహా సంఘం సమావేశం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅథితిగా హాజరైన మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యులు రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల అటెండర్ల కోసం షెడ్ నిర్మాణానికి,అంబులెన్స్ కోసం మంత్రి కోటా నుండి నిధులు మంజూరు చేయిస్తానని హమీచ్చారు. తాండూరులో బ్లడ్‌బ్యాంక్ ఎంతో అవసరమని, వచ్చే సమావేశానికి నాటికి జిల్లా ఆసుపత్రిలోబ్లడ్‌బ్యాంక్ మంజూరు చేయిస్తానని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృధ్దికి అధిక నిధులు ఇస్తున్నారని అన్నారు.ఆసుపత్రి పరిశుభ్రత విషయంలో ఏమాత్రం నిర్లక్షం వహించిన సహించేది లేదని,పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రికి వైద్యులను నియమించిన రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున విధులు నిర్వహించడం లేదని అన్నారు.ఈ విషయంలో ఆరోగ్యశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో మాట్లాడి ఖాళీ పోస్టుల భర్తికి కృషి చేస్తానని అన్నారు.జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ సమావేశంలోని అంశాలను అన్నింటిని సభ్యుల తీర్మాణం మేరకు ఆమోదిం చినట్లు వెల్లడించారు.జిల్లా ఆసుపత్రిలో తాండూరులో ఉండడం ఎంతగానో ఉపయోగపడుతుందని,వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవాలను అరికట్టాలి : సునీతారెడ్డి
ప్రైవేటు ఆసుపత్రులలో డెలివరి(ప్రసవం)లను అరికట్టాలని, ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు గర్ణిణులను పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు మందుల కోసం బయటికి చీటీలు రాయడం,ఆలా చేసే వారు ఎవ్వరైన సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శానిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసర మైతే కొత్తవారిని పెట్టుకోవాలని అన్నారు.అంతకు ముందు ఆసుపత్రి కమిటి సభ్యులు కరణం పురుషోత్తమరావు, మన్‌మోహన్ సార్డా, తాండూరు జడ్పీటిసి రవిగౌడ్‌లు జిల్లా ఆసుపత్రిలో శానిటేషన్ సక్రమంగా లేదని సూచించగా శానిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.రోగుల అటెండర్ల విశ్రాంతి కోసం ప్రత్యేక షెడ్ నిర్మాణం చేపట్టాలని కరణం పురుషోత్తమరావు సూచించారు.ఇందుకు స్పందించిన మంత్రికి అందుకు కావా ల్సిన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
డిప్యూటే షన్‌లపై వెళ్ళిన వైద్యులను వెంటనే తాండూరుకు రప్పించాలని సభ్యులు కోరారు.బ్లడ్ బ్యాంకు విషయంలో జిల్లా కోఆర్డినేటర్ హన్మంతురావు పనితీరుపై మంత్రి ఆసహానం వ్యక్తం చేసారు. దీనిపై ఎప్పటికప్పుడు పరివేక్షించాలని సూచించారు. ఈ సమా వేశంలో సభ్యులు వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవ రావు, జాయిం ట్ కలెక్టర్ అమ్రపాలి,తాండూరు మున్సి పల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి,బషీరాబాద్,తాండూరు ఎంపిపిలు కరుణ, తాండూరు జడ్పీటిసి రవిగౌడ్,ఎస్‌హెచ్‌ఒ హన్మంతు రావు, ఆసుపత్రి సూపరిండెంట్ భాగ్యశేఖర్‌గౌడ్, సభ్యులు సుమతి గౌడ్, మన్‌మోహన్ సర్డా తదితరులు ఉన్నారు.

Comments

comments