Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

దీపావళి పసిడి మెరుపులు

 

gold

ముంబయి: దీపావళి పండుగ సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ధర అంతనంత పైకి చేరుకుంది. బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.290 పెరిగి రూ.31 వేలకు చేరుకుంది. దంతెరస్, దీపావళి డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీంగా ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర నిలకడగా కొనసాగుతోంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి రూ.41,000గా ఉంది. అంతర్జాతీయంగా పసిడి ధర 0.12శాతం తగ్గి ఔన్సు 1,283.20 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత బంగారం(10 గ్రాములు) ధర రూ.290 తగ్గడంతో వరుసగా రూ.31,000, రూ.30,850కు చేరుకుంది. సెప్టెంబర్ 27వ తేదీ నాటికి స్థాయికి పసిడి ధర చేరింది. మంగళవారం బంగారం ధర రూ.140 పడిపోయింది.
పేటీఎంలో 12 రెట్లు పెరిగిన బంగారం సేల్స్
దంతెరస్ పర్వదినాన పేటీఎంలో గోల్డ్ సేల్స్ 12 రెట్లు పెరిగాయి. కొనుగోళ్లు జరిపిన వారిలో 60 శాతానికి పైగా చిన్న నగరాలు, పట్టణాలకు చెందిన వారే ఉన్నారని పేటీఎం పేర్కొంది. ఆరు నెలల కాలంలో దాదాపు రూ.120 కోట్ల విలువచేసే పేటీఎం గోల్డ్ విక్రయం జరిగిందని వెల్లడించింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వినియోగదారులు పసిడి క్రయవిక్రయాలు జరిపేందుకు మొబైల్ వ్యాలెట్ పేటీఎం డిజిటల్ గోల్డ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ధనత్రయోదశి నాటికి కొనుగోలుదారుల సంఖ్య 10 లక్షలు దాటిందని పేర్కొంది. దంతెరస్ రోజు బంగారం విక్రయాలు సాధారణంతో పోలిస్తే 12శాతం పెరిగాయని తెలిపింది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తుందని పేటీఎం తెలిపింది. ఎంఎంటిసి -ప్యాంప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని పేటీఎం గత ఏప్రిల్‌లో ఈ డిజిటల్ గోల్డ్ తీసుకొచ్చింది. దీని ద్వారా పేటీఎం వినియోగదారులు తమ మొబైల్ వ్యాలెట్ల నుంచి 24 క్యారెట్ల పసిడిని కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు చేసిన బంగారాన్ని ఎంఎంటిసి -ప్యాంప్ వద్ద ఉచితంగా భద్రపరుచుకోవచ్చు. నాణేల రూపంలో ఈ పసిడిని ఇంటి వద్దకే డెలివరీ, ఆన్‌లైన్ ద్వారా అమ్ముకోవడం వంటి సౌకర్యాలు కల్పించింది.

Comments

comments