Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం…

karunanidhi's medical condition declined

చెన్నై: తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ప్రస్తుతం ఆయన కావేరి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరుణ ఆరోగ్యం మరింత విషమించినట్టు ఆ హాస్పటల్ వర్గాలు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. క్రిటికల్ కేర్‌లో ఉన్న కరుణానిధిని అబ్జర్వేషన్‌లో పెట్టినట్టు హాస్పటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన వయసు సమస్యల దృష్ట్యా శరీరంలోని కీలక అవయవాలను సాధారణ స్థితికి తీసుకురావడం కష్టతరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. రాబోయే 24 గంటల్లో చికిత్సకు కరుణానిధి స్పందించిన రీతిని బట్టే తదుపరి ట్రీట్‌మెంట్ ఉండబోతుందని డాక్టర్లు చెబుతున్నారు.

Comments

comments